Templates by BIGtheme NET
Home >> Telugu News >> క్రికెట్ లోకి మైక్రోసాఫ్ట్ అడోబ్ ఓనర్లు

క్రికెట్ లోకి మైక్రోసాఫ్ట్ అడోబ్ ఓనర్లు


ఇండియాలో క్రికెట్ అంటే పిచ్చి. అయితే ఇప్పుడు భారతీయులు అమెరికాలోనూ బాగా విస్తరించారు. కీలక టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్ మైక్రోసాఫ్ట్ ను నడిపించే సీఈవోలు మన భారతీయులే. వారికి క్రికెట్ అంటే పిచ్చి. ఇక అడోబ్ అధినేత శంతను నారాయణ్ కూడా క్రికెట్ అంటే చెవి కోసుకుంటాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అంతగా ఆదరణ లేని క్రికెట్ కు ప్రాచుర్యం కల్పించాలని ప్రముఖ వ్యాపారవేత్తలు యోచిస్తున్నారు.

కార్పొరేట్ రంగంలో దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల అడోబ్ సీఈవో శంతను నారాయణ్ లు తమదైన ముద్రవేశారు. తాజాగా వీరిద్దరూ క్రికెట్ రంగంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

అమెరికా ఎంటర్ ప్రైజెస్ (ఏసీఈ) మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ (ఎంఎల్ సీ) పేరుతో లీగ్ నిర్వహించనుంది. ఈ లీగ్ లో ఇప్పటికే కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు.

తాజాగా భారత సంతతికి చెందిన సత్యనాదెళ్ల శంతను నారాయణ్ లు ఈ లీగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. వీరితోపాటు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కూడా ఎంఎల్సీ లీగ్ లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.

అమెరికాలో క్రికెట్ పై ఆసక్తి పెంచేందుకే ఈ లీగ్ ను ప్లాన్ చేసినట్లు ఏసీఈ కో ఫౌండర్ విజయ్ శ్రీనివాసన్ వెల్లడించారు.