గన్నవరం టీడీపీ ఇన్ చార్జి అతడేనా?

0

గన్నవరంలో తనకు తిరుగులేదని భావిస్తున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చంద్రబాబు షాక్ ఇవ్వబోతున్నాడా? వైసీపీలో చేరి తనకు తిరుగులేదనుకుంటున్న వంశీ కోసం బలమైన వ్యక్తిని దించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. భారీ ఆర్థిక వనరులున్న అతడిని నియోజకవర్గ టీడీపీ క్యాడర్ కూడా ఒప్పుందని అంటున్నారు.

ఏపీ అంతా జగన్ గాలి వీచింది. ఏకంగా 151 సీట్లను సాధించి పెట్టింది. అయితే గన్నవరం నియోజకవర్గంలో మాత్రం జగన్ గాలిని తట్టుకొని టీడీపీ గెలిచింది. పవర్ పాలిటిక్స్ దెబ్బకు తట్టుకోలేక వల్లభనేని వంశీ ఇన్ డైరెక్ట్ గా వైసీపీలోకి జంప్ అయ్యి అంతా అతడే ఆ నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఇన్ చార్జిని అక్కడ పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. టీడీపీకి మంచి ఓటు బ్యాంకు ఉన్నా ఎవరూ ఇన్ చార్జిగా తీసుకునే దమ్ము లేకుండా పోయిందట..

ఈ క్రమంలోనే ఇటీవల చంద్రబాబును కలిసి ‘మాకు ఖచ్చితంగా ఒక ఇన్ చార్జి ఇవ్వండని.. లేకపోతే కేడర్ దెబ్బతింటుందని’ గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలు కోరారట.. దీని బాబు సరే అని.. ‘ఎన్ఆర్ఐ ని మీరు ఒప్పుకుంటారా’ అని అడిగాడట.. దీనికి టీడీపీ కార్యకర్తలు ‘మాకు ఎవరైనా ఓకే కానీ.. పనిచేయాలని’ సూచించారు.

దీంతో చంద్రబాబు సరేనని త్వరలోనే గన్నవరంకు నియోజకవర్గ ఇన్ చార్జిని వేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చాడంట..‘తానా’లో ఒక ముఖ్య సభ్యుడు త్వరలోనే గన్నవరంకు టీడీపీ ఇన్ చార్జి అయ్యే చాన్స్ ఉందని అనుకుంటున్నారంట..

ఇలా గన్నవరంలో చక్రం తిప్పుదామని కలలుగంటున్న వంశీకి త్వరలోనే షాక్ తగలబోతోందని.. టీడీపీ క్యాడర్ ఏకమయ్యారని.. వంశీని దూరంపెట్టి అంతా టీడీపీ తరుఫునే నిలబడుతున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.