Templates by BIGtheme NET
Home >> Telugu News >> పీపీఈ కిట్ తో మోడీ.. కరోనా వ్యాక్సిన్ పరిశీలన

పీపీఈ కిట్ తో మోడీ.. కరోనా వ్యాక్సిన్ పరిశీలన


భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ పురోగతి తెలుసుకునేందుకు ఈరోజు మొదట అహ్మదాబాద్ ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకున్నారు.జైడూస్ క్యాడిలా వ్యాక్సిన్ పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రకియ ఉత్పత్తి నిల్వ సామర్థ్యం తదితర వివరాలను శాస్త్రవేత్తలతో మాట్లాడారు. జైడస్ క్యాడిలా బయెటిక్ పార్కులో పీపీఈ కిట్ ధరించి పరిశీలించారు. ‘జైకోవ్ డి’ టీకా ప్రయోగాలను గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.

ఇక ఆ పర్యటన ముగిశాక హైదరాబాద్ విచ్చేశారు. హైదరాబాద్ శివారుల్లోని జినోమ్ వ్యాలీలో గల భారత్ బయోటెక్ ను సందర్శించి ‘కోవాగ్జిన్’ వ్యాక్సిన్ అభివృద్ధిపై శాస్త్రవేత్తలతో చర్చించారు. కోవాగ్జిన్ టీకాపై ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రయోగాలు జరుగుతున్నాయని వారు తెలిపారు.

కోవాగ్జిన్ తాజా పరిస్థితిపై భారత్ బయోటెక్ యాజమాన్యం శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. వ్యాక్సిన్ తయారీ విషయంలో మోడీ పట్టుదలతో ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో భారత్ నిర్ణయాత్మక దశకు చేరుకున్న సమయంలో వ్యాక్సిన్ సన్నద్ధతపై శాస్త్రవేత్తలతో చర్చించేందుకు ప్రధాని ఈ పర్యటన చేపట్టినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

అంతకుముందు అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట వైమానిక స్థావరానికి చేరుకున్న ప్రధాని మోడీకి సీఎస్ సోమేష్ కుమార్ డీజీపీ మహేందర్ అధికారులు స్వాగతం పలికారు. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రధాని జినోమ్ వ్యాలీలో గల భారత్ బయోటెక్ సంస్థకు చేరుకున్నారు.