Templates by BIGtheme NET
Home >> Telugu News >> ప్రపంచంలోనే నిశ్శబ్ధ ప్రాంతం ఇదే..! మీ గుండె ఇతర భాగాల చప్పుడూ వినొచ్చు..!

ప్రపంచంలోనే నిశ్శబ్ధ ప్రాంతం ఇదే..! మీ గుండె ఇతర భాగాల చప్పుడూ వినొచ్చు..!


నిశ్శబ్ధం అంటే మామూలు నిశ్శబ్ధం కాదిది.. కటిక నిశ్శబ్ధం. ఎప్పుడైనా మీరు ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో నిశ్శబ్ధాన్ని చూసి ఉంటారు. గడియారం చిన్నముల్లు చేసే టక్టక్ మని శబ్ధం వినిపించొచ్చు. కానీ మన గుండెచప్పుడు మాత్రం వినిపించదు. ప్రపంచంలో ఓ ప్రదేశం ఉంది. అక్కడ ఉండేది పిన్డ్రాప్ సైలెంట్ కూడా కాదు. అంతకంటే ఎక్కువే. ఎందుకంటే మన గుండెచప్పుడు మనకు వినిపిస్తుంది. గుండె చప్పుడే కాదు.. మన శరీరంలోపలి భాగాలు చేసే చప్పుడు కూడా మనకి వినిపిస్తుంది

. ఆ ప్రదేశం ఎక్కడుందంటే.. అమెరికాలో ఏర్పాటైన ఒర్ఫీల్డ్ ల్యాబొరేటరీస్ అనే సౌండ్ డిజైన్ స్టూడియోలోని ఓ చాంబర్. ఇక్కడ చీమ చిటుక్కుమన్న వినిపిస్తుంది. అందుకు కారణం అక్కడ ఉండే నిశ్శబ్ధం. బహుశా ప్రపంచంలోని మరేచోట కూడా ఇంత నిశ్శబ్ధం ఇప్పటివరకు ఎవరూ సృష్టించలేదు. అయితే ఈ స్టూడియోను సంగీత వాయిద్య పరికరాల నాణ్యతను పరిశీలించేందుకు ఉపయోగిస్తారు. అంతరిక్షంలోని నిశ్శబ్దాన్ని తట్టుకోవడానికి వ్యోమగాములు సైతం ఈ చాంబర్ లోనే ట్రైనింగ్ తీసుకుంటారు. ఇక్కడ అంత నిశ్శబ్ధం ఉండటానికి కారణం ఈ గదికి అమర్చిన గోడలు.. ఆ గోడలు బయటి శబ్ధాన్ని లోపలికి రానివ్వవు.

చాంబర్ లోపల శబ్ధస్థాయి – 9.4 డెసిబుల్స్ మాత్రమే ఉంటుంది. దీంతో మన శరీర భాగాలు చేసే చప్పుడు మనకు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరూ ఎక్కువసేపు ఉండలేరని.. మనశరీరభాగాలు చేసే చప్పుడు అతి భయానకంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ గదిలో ఒక్కరమే ఉన్నామంటూ ఒంటరిగా హారర్ సినిమా చూస్తున్నట్టే అన్నమాట.