Templates by BIGtheme NET
Home >> Telugu News >> సైకిల్ సింబల్ తో రజనీ ఎంట్రీ.. ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నాడా?

సైకిల్ సింబల్ తో రజనీ ఎంట్రీ.. ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నాడా?


రజనీకాంత్ కొత్త పార్టీ పేరు ఏమిటి? పార్టీ జెండా ఎలా ఉంటుంది? ఎజెండాను తలైవా ఎలా సెట్చేశారు? ఇంతకీ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉండబోతున్నాయి. ఆధ్యాత్మిక పార్టీ అంటున్నారు నిజమేనా? ప్రస్తుతం తమిళనాడులో ఈ రకమైన చర్చలు మొదలయ్యాయి. డిసెంబర్ 31న పార్టీ పెట్టబోతున్నానని రజనీ ప్రకటించడంతో అభిమానుల్లో కొత్త జోష్ మొదలైంది. నిజానికి ఆరోగ్యం సహకరించకపోవడంతో రజనీ పార్టీ పెట్టొద్దనుకున్నారు. ఈ మేరకు సోషల్మీడియాలో కూడా వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి.

అయితే చివరకు అభిమానుల ఒత్తిడి.. బీజేపీ కోరిక మేరకు రజనీ పార్టీని ప్రకటించాడని సమాచారం. అయితే రజనీ పార్టీ పేరు ఏమిటి? జెండా రంగు ఏమిటి? సిద్ధాంతాలు ఎలా ఉండబోతున్నాయని తమిళనాట ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రజనీకాంత్ కూడా తన అభిమానులు ఆత్మీయులు రాజకీయసలహాదారులతో ఈ విషయంపైనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారట. అయితే ఇటీవల పార్టీ డిసెంబర్ 31న పెట్టబోతున్నట్టు రజనీ ప్రకటించినప్పుడు బాబా ముద్ర చూపించారు. తనదైన స్టైయిల్లో బాబా ముద్రను చూపుతూ అభివాదం చేశారు. అయితే పార్టీ సింబల్ కూడా అదే అయిఉంటుందని అంతా భావించారు. నిజానికి ఈ సింబల్ ను గతంలోనే రజనీ ఫ్యాన్స్ విరివిగా వాడేవారు.

ఇదే పార్టీ సింబల్గా పెడదామనుకున్నారట. కానీ ఎన్నికల సంఘం విడుదల చేసిన గుర్తుల జాబితాలో ఈ సింబల్ లేదు. ఎన్నికల సంఘం కొత్త పార్టీలకు సంబంధించిన కొన్ని సింబల్స్ను చూపిస్తుంది. వాటిలో ఏదో ఒకటి ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది.అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం వద్ద అందుబాటులో ఉన్న గుర్తుల్లో సైకిల్ గుర్తు అభిమానులకు తెగ నచ్చేసిందట. ఈ సింబల్ అయితే సులభంగా ప్రజల్లోకి వెళ్తుందని.. రజనీ సన్నిహితులు కూడా చెప్పారట. రజనీకి సన్నిహితులైన పలువురు రాజకీయ గురువులు మీడియా మిత్రులు కూడా ఈ సింబల్నే ఖరారు చేసుకోమని సూచిస్తున్నారట.

గతంలో టీడీపీ పార్టీ స్థాపించిన ఎన్టీఆర్కు కూడా ఈ సింబల్ కలిసి వచ్చింది. యూపీలోని సమాజ్ వాద్ పార్టీది కూడా సైకిల్ సింబలే. ఈ గుర్తుతో ఆ పార్టీ పలుమార్లు అధికారంలోకి వచ్చింది. అందువల్ల రజనీ ఫ్యాన్స్ ఈ గుర్తువైపు మొగ్గుచూపినట్టు సమాచారం. రజనీకాంత్ హీరోగా నటించిన అణ్ణామలై లో రజనీ పాలవాడి గా సైకిల్ పై తిరుగుతూ పాడిన ‘రెక్కగట్టి పరక్కుదయ్యా అణ్ణామలై సైకిల్ ‘ పాట పాడతూ వెళుతుంటాడు. ఈ పాట అప్పట్లో పెద్దహిట్. దీంతో ఈ గుర్తును ఎంపికచేసుకున్నట్టు సమాచారం. మరోవైపు ప్రస్తుతం రెక్కగట్టి పరక్కుదయ్యా పాట సోషల్మీడియాలో వైరల్గా మారింది. రజనీ పార్టీ జెండా కలర్ ఇదే నంటూ కూడా కొన్నిరంగులు పార్టీ పతాకం ఫొటో వైరల్గా మారింది. అయితే రజనీ త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వనున్నాడు.