దేశంలోనే అత్యంత సంపన్నుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మరో సంచలనానికి రెడీ అవుతోంది. అత్యంత చౌక ధరకే 5జీ ఫోన్‌ను తీసుకువచ్చే యోచనలో ఉంది. దీంతో మరింత మంది యూజర్లకు చేరువ కావాలని యోచిస్తోంది.
రిలయన్స్ జియో రూ.5,000 కన్నా తక్కువ ధరకే 5జీ ఫోన్ తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. తర్వాత ఈ ధరను రూ.2,500- రూ.3,000 వరకు ధరను తగ్గించనుంది. కంపెనీ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీ ప్రస్తుతం 2జీ ఫోన్ వాడుతున్న వారు లక్ష్యంగా ఈ 5జీ ఫోన్ తీసుకురాబోతోంది.
20- 30 కోట్ల మంది యూజర్లు లక్ష్యంగా జియో తన 5జీ ఫోన్‌ను తీసుకువస్తోంది. ‘రిలయన్స్ జియో రూ.5,000లోపు ధరలోనే 5జీ ఫోన్ తీసుకురావాలని భావిస్తోంది. అమ్మకాలను పెంచే క్రమంలో ఈ 5జీ ఫోన్ ధర రూ.2,500-రూ.3,000కు తగ్గుతుంది’ అని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. రూ.2,500కే 5జీ ఫోన్ అంటే సంచలనమనే చెప్పాచ్చొ.
అయితే చౌక ధరకే 5జీ ఫోన్ అంశంపై రిలయన్స్ జియోకు ఈమెయిల్ చేస్తే ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం భారత దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్స్ ధర రూ.27,000 నుంచి ప్రారంభమౌతోంది. అంతేకాకుండా ఇటీవల యూజర్లలో 5జీ ఫోన్లపై అవగాహన పెరిగింది. కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.
కాగా దేశంలో 4జీ మొబైల్ ఫోన్ తీసుకువచ్చిన మొట్టమొదటి కంపెనీగా రిలయన్స్ జియో తిరుగులేని రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఫోన్ ఉచితమని చెప్పినా కూడా రూ.1,500 రిఫండబుల్ మొత్తాన్ని కట్టాలి. అంతేకాకుండా రిలయన్స్ జియోలో ఇప్పటికే చాలా కంపెనీలో భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేశాయి. ఈ డబ్బులతో కంపెనీ 5జీ ఫోన్లను తయారు చేసి కస్టమర్లకు అందించే అవకాశముంది.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
