Templates by BIGtheme NET
Home >> Telugu News >> మూడు రాజధానులు : విచారణ వాయిదా వేసిన సుప్రీం..కారణం ఇదే!

మూడు రాజధానులు : విచారణ వాయిదా వేసిన సుప్రీం..కారణం ఇదే!


Supreme Court Judgement On Andhra Pradesh Three capitals

Supreme Court Judgement On Andhra Pradesh Three capitals

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఎంత వేగంగా ఏర్పాటు చేయాలనీ చేస్తున్నారో ..అంతే వేగంగా ప్రభుత్వానికి మూడు రాజధానుల విషయంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాజధాని వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదిస్తూ గవర్నర్ ఇచ్చిన గెజిట్పై హైకోర్టు మొదట 14 వరకు ఆ తర్వాత ఆగస్టు 27 వరకు స్టేటస్ కో ను ఇచ్చింది. ఆయితే రాజధాని వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని ఏపీ సర్కార్ సుప్రీం ను ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై నేడు చర్చ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం దాన్ని బుధవారానికి వాయిదా వేసింది. ఈ కేసును వేరే బెంచ్ కు లిస్టు చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది .

రాజధాని వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఎత్తేయాలని ఏపీ సర్కార్ వేసిన పిటిషన్ పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. అయితే విచారణ జరుగుతున్న సమయంలో రైతుల తరఫున హాజరైన సీనియర్ కౌన్సిల్ రజింత్ కుమార్ ప్రధానన్యాయమూర్తి బాబ్డే దృష్టికి ఓ విషయాన్ని తీసుకువచ్చారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన బంధువులు రైతుల తరఫున హాజరవుతున్నారని చెప్పారు. దీంతో ఈ కేసు నుంచి తాను తప్పుకుంటున్నానని బాబ్డే అన్నారు. ఈ కేసును వేరే బెంచ్కు లిస్టు చేయాలని రిజిష్ట్రార్ను ఆదేశిస్తూ.. వచ్చే బుధవారానికి వాయిదా వేశారు.