కొత్త పార్లమెంట్ భవనం కాంట్రాక్టు టాటాదే

0

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును ‘టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్’ దక్కించుకుంది. రూ.861.90 కోట్లకు ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రజా పనుల శాఖ ఈరోజు బిడ్లను తెరవగా.. టాటా ఎల్అండ్ టీ సంస్థలు ప్రధానంగా పోటీపడ్డాయి. ఏడాదిలో ఈ పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం పూర్తి చేయాలని కండీషన్ పెట్టారు. ఎల్ అండ్ టీ865 కోట్లకు బిడ్ వేయగా.. టాటా 861.90 కోట్లకు వేసింది. దీంతో కాంట్రాక్టు టాటా సొంతమైంది.

భారత్ 75వ స్వాతంత్ర్య వేడుకలు (వజ్రోత్సవాలు) 2022 ఆగస్టు 15న జరగబోతున్నాయి. ఆ సమయానికి కొత్త పార్లమెంట్ భవనంలోనే ఉభయ సభల సమావేశాలు జరిగేలా కొత్త భవనం నిర్మించాలని మోడీ సర్కార్ ప్లాన్ చేసింది.

85 ఏళ్ల క్రితం బ్రిటీష్ వారి హయాంలో కట్టారు మన భారత పార్లమెంట్ భవనం. ఇప్పటికీ ఇది మన లోక్ సభ రాజ్యసభకు వేదికగా ఉంది. అయితే ఈ బిల్డింగ్ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. దాంతోపాటు ఇందులో ఫైర్ సేఫ్టీ సహా మౌలిక సదుపాయాలు లేవు. రక్షణ పరంగా కూడా ఆమోదయోగ్యంగా లేదు.

ప్రస్తుత పార్లమెంట్ భవనం.. ప్రపంచ వారసత్వ సంపదగా ఉంది. దీంతో దీన్ని చెక్కు చెదరకుండా భావితరాలకు అందించాలి. అందుకే మోడీ సర్కార్.. అవసరాలకు సరిపోని ప్రస్తుత పార్లమెంట్ స్థానంలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మించాలని యోచిస్తున్నారు.

ఇప్పటికే యూపీఏ2 హయాంలోనే నాటి ప్రభుత్వం ఓ కమిటీని కొత్త పార్లమెంట్ కోసం వేసింది. ఇక రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు గత ఏడాది ఆగస్టు 5న కొత్త భవనం నిర్మించాలని ప్రధాని మోడీకి ప్రతిపాదించారు. అయితే కరోనా కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది.

గుజరాత్ కు చెందిన బిమల్ పటేల్ ఆర్కిటెక్ట్ సంస్థ ‘హెచ్.సీ.పీ డిసైన్స్’ కొత్త పార్లమెంట్ రూపకల్పన బాధ్యతలు చేపట్టింది. త్రిభుజాకారంలో ప్రస్తుత పార్లమెంట్ ను డిజైన్ చేశారు. పాత పార్లమెంట్ తరహాలోనే ఈ కొత్త పార్లమెంట్ డిజైన్ తీర్చిదిద్దారు. 21 నెలల్లోనూ పూర్తి కావాలన్నది ప్రభుత్వం లక్ష్యం.

కొత్త పార్లమెంట్ లో ఒకేసారి 1345మంది సభ్యులు ఉమ్మడి పార్లమెంట్ లో కూర్చేనే స్థాయిలో సువిశాలంగా సెంట్రల్ మాల్ ను నిర్మిస్తున్నారు.

దీన్ని రాష్ట్రపతి భవన్ కు దక్షిణాన ప్రధానమంత్రి అధికారిక నివాసం.. ఉపరాష్ట్రపతికి కొత్త అధికార నివాసం ఏర్పాటు చేస్తూ ఈ ప్రాజెక్టుకు ‘సెంట్రల్ విస్తా’ అని పేరు పెట్టారు.