యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై కోర్టు కీలక నిర్ణయం

0

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాస్తుల కేసులో విచారణ సందర్భంగా సీబీఐ కోర్టులో వాదనలు ఈరోజు ముగిశాయి. ఈ కేసులో ఆగస్టు 25న కోర్టు తుది తీర్పును వెల్లడించనుంది.జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ లో లిఖిత పూర్వక వాదనలకు సీబీఐ నేడు మరోసారి సమయం కోరింది.సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని సీబీఐ తరుఫున న్యాయవాది కోర్టుకు వెళ్లడించారు. మరింత సమయం కావాలని విన్నవించారు.

దీనిని రఘురామ తరుఫున న్యాయవాది వ్యతిరేకించారు. గడువు ఇవ్వొద్దని హైకోర్టులో విజ్ఞప్తి చేశారు. ఇదే రోజు సీబీఐ ఏదో ఒకటి చెప్పాలని.. మరింత సమయం ఇస్తామని విచారణను కోర్టు వాయిదా వేసింది. కొంత సేపటి అనంతరం సీబీఐ న్యాయవాది వచ్చి.. తాము ఈ కేసులో ఎలాంటి వాదనలు వినిపించడం లేదని.. విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరారు.

ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..ఈ కేసులో విచారణ ముగిసిందని.. ఆగస్టు 25న తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపారు. దీంతో జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

ఒక వేళ జగన్ బెయిల్ రద్దు చేస్తే ఆయన ఏపీ సీఎం సీటును ఖాళీ చేయాల్సిందే. ఆప్లేసులో మరో నేతను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఏపీ ప్రభుత్వంలో కల్లోలం ఖాయం. దీంతో కోర్టు నిర్ణయంపైనే జగన్ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పొచ్చు.