యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

వైరల్: ఎంఎస్ ధోని లుక్.. ఇలా మారాడేంటి?

0

భారత క్రికెట్ తలరాతను మార్చిన ఘనుడు అతడు. ఝార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రం నుంచి వచ్చి అలుపెరగని ఆత్మస్థైర్యంతో భారత క్రికెట్ జట్టు రూపు రేఖలు మార్చి అనితర సాధ్యం కాని ప్రపంచకప్ లను సాధించిపెట్టిన ధీరోధాత్తుడు ఎంఎస్ ధోని. టీమిండియాలోకి వచ్చినప్పుడు ఈ ఝార్ఖండ్ డైనమేట్ భారీగా పేలింది. సిక్సులు, ఫోర్లతో ఇండియాకు విజయాలను అందించాడు. అతడికి గుర్తింపు బాగా తెచ్చింది అతడి జులపాల జట్టే. ఆ జట్టు ధోని కెరీర్ మొదట్లో ఎంతో వైరల్ అయ్యింది. ధోని జులపాల జట్టుకు నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రాఫ్ కూడా ఫ్యాన్ అయిపోయానని చెప్పుకొచ్చాడు.

ప్రతి సంవత్సరం కొత్త జుట్టుతో కనిపించడం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అలవాటు. టీమిండియా కెప్టెన్ గా ఉన్నప్పుడే ఈ సంప్రదాయం పాటిస్తున్నాడు. ఇక ఐపీఎల్ జట్టు చెన్నై కెప్టెన్ గా కూడా ధోని ప్రతి సంవత్సరం కొత్త హెయిర్ లుక్ లో కనిపిస్తాడు.

తాజాగా ధోని మరోసారి ఆశ్చర్యపరిచాడు. మొన్నటిదాకా భారీ మీసాలతో అలరించిన ధోని ఇప్పుడు కోత్త మేకవర్ కు మారిపోయాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఎంఎస్ ధోనిని మరో ఆకర్షనీయమైన అల్ట్రా స్టైలిష్ లుక్ లోకి మార్చేశాడు. రేజర్ లా పదునైన గడ్డంతోపాటు ఉబర్ కూల్ ఫాక్స్ హాక్ కట్ స్టైల్ లో ధోని కనిపించాడు. ఈ లుక్ ధోనికి బాగా సరిపోయింది. అభిమానులు ధోని లుక్ కు ఫిదా అయి కామెంట్ల వర్షం కురినిపిస్తున్నాడు.గ్లోబల్ క్రికెట్ ఐకాన్ ధోని అంటూ కొనియాడుతున్నారు.