మంత్రి కేటీఆర్ సాయం కోరిన యాంకర్ రష్మీ

0

జబర్ధస్త్ హాట్ యాంకర్ ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. తెరపైన అందాలు ఆరబోయడమే కాదు.. తెరవెనుక కూడా తన మనసు చల్లన అని నిరూపించారు. ఓ మంచి పని కోసం తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సాయం కోరారు.బుల్లితెరపై రాణిస్తున్న యాంకర్ రష్మీ సామాజికసేవలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. జంతు ప్రేమికురాలుగా ఆమెకు పేరుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆమె తన ఇంట్లో కుక్కలు, పావురాలు, పిల్లులు సహా జంతువులను సాకుతుంది.

ఇక జంతు పరిరక్షణ కోసం యాంకర్ రష్మీ ప్రత్యేకంగా పలు కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వస్తోంది. తాజాగా యాంకర్ రష్మీ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఓ విషయంపై విజ్ఞప్తి చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుక్కలకు యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) ఆపరేషన్లు చేస్తూ వాటి సంతతి పెరగకుండా చేస్తున్నారు. దీనికి ఏదైనా పరిష్కార మార్గం కనుగొనాలని.. వీధి కుక్కలు కనుమరుగు కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా రష్మీ మంత్రి కేటీఆర్ ను, ఆయన ఆఫీస్ ను ట్యాగ్ చేస్తూ విన్నవించారు.

గత కొంతకాలంగా హైదరాబాద్ లో వీధికుక్కల సంఖ్యను తగ్గించేందుకు వైద్య సిబ్బంది శునకాలకు ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారు. దీంతో కుక్కల సంఖ్య తగ్గిపోతోంది. వాటి పునరుత్పత్తి జరగడం లేదు. ఇలా దాదాపు 2122 శునకాలకు ఆపరేషన్ చేసి ఇలాగే నిర్ధాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశారని ఓ నెటిజన్ ట్వీట్ చేయడంతో దాన్ని చూసి చలించిన రష్మీ ఇలా మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ విన్నవించింది.