ప్రపంచ కుబేరుల జాబితాలో 4 నుండి 6 కి పడిపోయిన అంబానీ..కారణం ఇదే!

0

భారత అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈయన ప్రపంచంలో ఉన్న అపర కుబేరుల్లో ఒకరు. అయితే తాజాగా ప్రపంచ అపర కుబేరుల జాబితా లో 4 వ స్థానం నుండి 6 వ స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ ఆస్తుల నికర విలువ 78.3 బిలియన్ డాలర్లు. దీనితో ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఆరో స్థానంలో నిలిచాడు. గతంలో అయన సంపద 80. 2 బిలియన్ డాలర్లగా ఉండేది.

ఆయన ప్రధాన సంస్థ ఆర్ ఐఎల్ షేర్ల ధరలు పడిపోవడంతో అంబానీ ఆస్తుల విలువ కూడా పడిపోయింది. టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్ మరియు బెర్నార్డ్ ఆర్నాల్ట్ యొక్క నికర విలువ పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం వరుసగా ఇద్దరు నాలుగు అయిదు స్థానాల్లో ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో ఆర్ ఐఎల్ అధినేత ముఖేష్ అంబాని ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఎల్విఎంహెచ్ మోయిట్ హెన్నెస్సీ లూయిస్ విట్టన్ చైర్మన్ మరియు సిఇఒ బెర్నార్డ్ ఆర్నాల్ట్ను అధిగమించి నికర ఆస్తుల విలువ 80.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇకపోతే ప్రపంచ కుబేరుల్లో టాప్ టెన్ లో .. 8 మంది అమెరికన్లే. వారిలో భారత్ నుండి అంబానీ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. రూ . 14. లక్షల కోట్ల సంపద తో బెజోస్ అగ్రస్థానంలో ఉన్నారు.