నిన్న టిక్ టాక్ .. నేడు అలీబాబా : ట్రంప్ దూకుడు !

0

Trump indicates banning Alibaba

Trump indicates banning Alibaba

కరోనా మహమ్మారి నేపథ్యంలో చైనా పై తీవ్రమైన పదజాలం తో విరుచుకుపడుతున్నారు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్. చైనా పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ..చైనా కంపెనీలకి వరుస షాకులిస్తున్నారు. ఇప్పటికే టిక్ టాక్ బ్యాన్ కి రంగం సిద్ధం చేసిన ట్రంప్ .. తాజాగా టెక్నాలజీ దిగ్గజం అలీబాబాను టార్గెట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలీబాబా వంటి చైనా కంపెనీలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి సరైన సమాచారాన్ని ప్రపంచానికి చెప్పకుండా ఇంతటి ఘోర వినాశనానికి కారణం అంటూ ఆగ్రహం ఒకవైపు మరోవైపు రానున్న ఎన్నికల్లో నేపథ్యంలో చైనా కంపెనీలపై ఉక్కుపాదం మోపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలీబాబాపై నిషేధాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం దృష్టిలో చైనా యాజమాన్యంలోని ఇతర ప్రత్యేక సంస్థలు ఉన్నాయా అని ప్రశ్నించినపుడు ట్రంప్ ఈ విధంగా ఎస్పాన్డ్ అయ్యారు. అమెరికాలో ఇతర కంపెనీల నిషేధం విషయాన్నికూడా పరిశీలిస్తున్నామన్నారు. కాగా టిక్టాక్ నిషేధం అంశంపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ట్రంప్..అమెరికాలో టిక్ టాక్ వ్యాపారాన్ని ఏదైనాఅమెరికా కంపెనీకి విక్రయించాలని లేదంటే నిషేధం తప్పదని బైట్ డాన్స్ కు స్పష్టంగా తెలిపారు. ఈ మేరకు విధించిన 45 రోజుల గడువును 90 రోజులకు పెంచుతూ ఇటీవల ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో టిక్ టాక్ ను మైక్రోసాఫ్ట్ టేక్ ఓవర్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.