బీజేపీకి వత్తాసుపై ఫేస్ బుక్ క్లారిటీ!

0

Facebook clarity on Support for BJP

Facebook clarity on Support for BJP

దేశంలో ‘సోషల్’ ఫైట్ మొదలైంది. ఫేస్ బుక్ వాట్సాప్ లు భారత్ లో అధికార బీజేపీకి వత్తాసు పలుకుతున్నాయని.. బీజేపీతో ఫేస్ బుక్ చేతులు కలిపిందని అమెరికన్ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన కథనం దేశంలో రాజకీయ దుమారం రేపింది. దీనిపై రాహుల్ గాంధీ తాజాగా నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలు బీజేపీని ఫేస్ బుక్ ని లక్ష్యంగా చేసుకున్నాయి.

ఈ విమర్శలపై తాజాగా ఫేస్ బుక్ స్పందించింది. రాజకీయాలు రాజకీయ నేతలతో సంబంధం లేకుండా తమ విధానాలను అమలు చేస్తున్నామని ఫేస్ బుక్ ఇండియా ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఏ రాజకీయ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేకుండా హింసను ప్రేరేపించే ద్వేషపూరిత కంటెంట్ ను తాము నిషేధించామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాలను అమలు చేస్తున్నామని ఫేస్ బుక్ స్పష్టం చేసింది.

తమ కఠిన నిబంధనల అమలులో పురోగతి సాధిస్తున్నామని ఫేస్ బుక్ తెలిపింది. రెగ్యులర్ ఆడిట్లను నిర్వహిస్తున్నామని పేర్కొంది.

కాగా అమెరికా మీడియా కథనం ఆధారంగా కాంగ్రెస్ సీనియర్ నేత.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ తాజాగా సాక్ష్యాలను పరిశీలించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ల దుర్వినియోగాన్ని నివారించడం అనే అంశంపై నోటీసులు ఇస్తామని ప్రకటించడంతో బీజేపీ మండిపడింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ ఆరోపణలను ఖండించారు.