
Real Reason Behind Aishwarya Rai and Salman Khan Broke Up
ఆ ఇద్దరూ గొప్ప ప్రేమికులు. ప్రేమకు కులం మతం లేదని నిరూపించిన మహనీయులు. దాదాపు దశాబ్ధం పాటు నిండా ప్రేమలో మునిగి తేలారు. పబ్బు క్లబ్బు పార్టీ అంటూ ప్రేమగువ్వలు చేయని షికార్ లేదు. ఇక కెరీర్ పరంగా కలిసే జర్నీ చేశారు. తన సినిమాల్లో అవకాశాలిచ్చి సదరు హీరోయిన్ కం లవర్ ని ఎంకరేజ్ చేశాడు. అందుకే పర్ఫెక్ట్ కపుల్ గా సాటి స్టార్లు పొగిడేసేవారు.
కానీ ఏం లాభం? వన్ ఫైన్ డే అనూహ్యంగా ఆ ఇద్దరి ప్రేమలో కలతలు మొదలయ్యాయి. ఫలానా హీరో మధ్యలో ప్రవేశించాడని ఆ స్టార్ హీరో వీరంగం వేశాడు. ప్రేయసిని చితక తన్నాడు. నిరంతరం తిట్లు చీవాట్లతో బోలెడంత యాగీ చేశాడు. అయితే తనని అంతగా వేధించడానికి కారణం తన స్వచ్ఛమైన ప్రేమనే. అతడి మనసు వెన్న లాంటిదని పొగిడేస్తుంటారు తెలిసిన వాళ్లు.
కానీ తట్టుకోలేని ప్రేమ బెడిసి కొట్టింది. తన జీవితంలో ఇక ఎప్పటికీ పెళ్లి అనే ఆలోచనే రాకుండా నిలువరించింది ఆ సన్నివేశం. తనకు సాటి మనుషుల్లో అపప్రద వచ్చి పడింది. చివరికి ఓసారి ఆ ఇద్దరి మధ్యా జరిగిన గొడవలో తాను అపార్ట్ మెంట్ పై నుంచి దూకి చనిపోతానని అతడు బెదిరించేవరకూ వెళ్లింది. ఇంతకీ ఆ ప్రేమ జంట ఎవరు? అన్నది అందరికీ తెలుసు. అయితే ఈ ఎపిసోడ్ లో అతడు అపార్ట్ మెంట్ మీద నుంచి దూకి చస్తాను! అని బెదిరించినది కొందరికే తెలిసిన నిజం. ఇంతకీ ఎవరీ ప్రేమ జంట? అంటే.. ఐశ్వర్యారాయ్- సల్మాన్ ఖాన్ జంట గురించే ఇదంతా.