2020 బెస్ట్: టాలీవుడ్ లో బన్ని.. బాలీవుడ్ లో దేవగన్

0

ఇంతకీ 2020 బెస్ట్ హీరో ఎవరు? అప్పుడే డిక్లేర్ చేసేయడం ఎలా? అంటారా.. డిసెంబర్ నాటికి కానీ ఏడాదిలో బెస్ట్ సినిమా ఏదో బెస్ట్ హీరో ఎవరో చెప్పలేం. కానీ ఈసారి సీన్ అలా లేదు. కోవిడ్ మహమ్మారీ అన్నిటికీ అలా చెక్ పెట్టేసింది. ముఖ్యంగా సినీపరిశ్రమల్ని అడ్డంగా బుక్ చేసింది. షూటింగుల్లేవ్ .. థియేటర్లు తెరవలేరు. అందువల్ల దసరా.. క్రిస్మస్ వెళ్లినా థియేటర్ లో బొమ్మ పడే సీన్ కనిపించడం లేదు. ఓటీటీ రిలీజుల్ని వదిలేస్తే పెద్ద తెరపై ఆడిన సినిమాల్ని పరిగణిస్తే తెలిసిన సంగతులివీ..

2020లో ఇప్పటికే రిలీజై బ్లాక్ బస్టర్లు కొట్టిన సినిమాలను ట్రాక్ చేసి అందులో నటించిన హీరోల్నే బెస్ట్ హీరోలుగా ప్రకటించేస్తే సరిపోతుంది కదా? అన్నది ఆన్ లైన్ సర్వేలో నెటిజనుల అభిప్రాయం. ఆ కోణంలో చూస్తే బాలీవుడ్ లో ఇప్పటివరకూ సల్మాన్ .. అమీర్ .. షారూక్… అక్షయ్ లాంటి టాప్ స్టార్లు నటించిన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. అజయ్ దేవగన్ నటించిన తానాజీ మినహా ఇంకే పెద్ద హీరో సినిమా రిలీజ్ కాలేదు. తానాజీ దేవగన్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రం. ఇందులో సైఫ్ ఖాన్ అద్భుత పాత్రలో నటించారు.

సల్మాన్ – రాధే.. అమీర్ లాల్ సింగ్ చద్దా.. లుక్ రిలీజ్ లు తప్ప ఈ ఏడాది రిలీజవుతున్నాయా? అంటే ఇంకా చెప్పలేం. ఇంతకీ ముంబైలో థియేటర్లు తెరుస్తారా లేదా.. మహారాష్ట్ర వ్యాప్తంగా సన్నివేశం ఎలా ఉంది? అంటే చెప్పాల్సిందేమీ లేదు. అక్కడ కోవిడ్ విలయతాండవం ఆడుతోంది. అన్ స్టాపబుల్ గా ప్రజల్ని వెంటాడుతోంది. అందుకే ఇక థియేటర్లు తెరిచే సీన్ లేదన్నది అర్థమవుతోంది.

అన్నట్టు .. 2020 టాలీవుడ్ బెస్ట్ హీరో ఎవరో డిక్లేర్ చేయాల్సి వస్తే.. ఏ హీరో పేరు చెబుతారు? అంటే నిరభ్యంతరంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నే బెస్ట్ హీరో అని ప్రకటించేయాలేమో. అల వైకుంఠపురములో చిత్రం సంక్రాంతి రేస్ లో రిలీజై ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. బన్ని నటనకు గొప్ప పేరొచ్చింది. ఇక పోటీబరిలో రిలీజైన సరిలేరు నీకెవ్వరు కలెక్షన్లు బావున్నా.. కంటెంట్ పరంగా తేలిపోయింది కాబట్టి లైట్ తీస్కుంటారంతా. అల .. చిత్రం తర్వాత నితిన్ చిత్రం `భీష్మ` మంచి విజయం అందుకుంది. కాబట్టి సెకండ్ బెస్ట్ ఎవరు? అంటే నితిన్ పేరునే చెప్పాలి మరి. తానాజీ బాలీవుడ్ లో బెస్ట్ హిట్ చిత్రం కాగా అజయ్ దేవగన్ బెస్ట్ హీరో. టాలీవుడ్ లో అల వైకుంఠపురములో .. బన్నికే ఆ క్రెడిట్ దక్కుతుంది మరి.