Templates by BIGtheme NET
Home >> Cinema News >> 2020 రివ్యూ : టీవీలో సత్తా చాటిన టాప్ 5 సినిమాలు

2020 రివ్యూ : టీవీలో సత్తా చాటిన టాప్ 5 సినిమాలు


ఈమద్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు కలెక్షన్స్ పరంగానే కాకుండా అనేక రకాలుగా టీఆర్పీ రేంటింగ్ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. శాటిలైట్ రైట్స్ ను కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్న టీవీ ఛానెల్స్ కు కొన్ని సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈసారి కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాలకు మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చింది. గతంలో ఎప్పుడు చూడని రేటింగ్ ను ఈ ఏడాది సినిమాలు దక్కించుకున్నాయి. టాఫ 5 లో మహేష్ బాబు ఒకే సినిమాతో రెండు సార్లు నిలవడం మరో అద్బుతమైన రికార్డుగా చెప్పుకోవచ్చు.

ఈ ఏడాదిలో అత్యధిక టీఆర్పీని దక్కించుకున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాను జెమిని టీవీ దక్కించుకుంది. జెమిని టీవీ ఈ సినిమాను మొదటి సారి టెలికాస్ట్ చేసిన సమయంలో 29.4 టీఆర్పీ వచ్చింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు మరియు రష్మిక మందన్నా నటించారు. ఇక ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించారు. రెండవ స్థానంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా నిలిచింది. 23.4 టీఆర్పీ రేటింగ్ తో ఈ సినిమా సత్తా చాటింది. బన్నీ ఈ సినిమాతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద నెం.1 గా నిలిచాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రేటింగ్ విషయంలో నెం.2 గా నిలిచింది.

మూడవ స్థానంలో కూడా రెండవ సారి టెలికాస్ట్ అయిన సమయంలో 17.4 రేటింగ్ దక్కించుకున్న సరిలేరు నీకెవ్వరు నిలిచింది. రెండవ సారి టెలికాస్ట్ సమయంలో ఈ రేంజ్ లో రేటింగ్ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. నాల్గవ స్థానంలో 15.13 రేటింగ్ ను దక్కించుకున్న ప్రతి రోజు పండుగే సినిమా నిలిచింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు బుల్లి తెర ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక చివరగా అయిదవ స్తానంలో సైరా నరసింహారెడ్డి నిలిచింది. చిరంజీవి నటించిన ఈ సినిమాకు 11.8 రేటింగ్ వచ్చింది. ఈ ఏడాది టాప్ 5 టీఆర్పీ రేటింగ్ సినిమాల్లో 3 మెగా హీరోలవి కాగా రెండు మహేష్ బాబువి.