అమ్మడి కోసం ‘ఆచార్య’ అప్పటి దాకా ఆగాల్సిందే..!

0

దక్షిణాది అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ఇటీవలే ప్రియుడిని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కోవిడ్ నేపథ్యంలో తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి మాల్దీవులకు హనీమూన్ వెళ్లి తిరిగి వచ్చింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని ప్రకటించిన కాజల్.. హనీమూన్ నుంచి వచ్చిన వెంటనే షూటింగ్ ల్ పాల్గొంటారని వార్తలు వచ్చాయి. కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ 9 నుండి తిరిగి ప్రారంభించాలని అనుకున్నారు. హైదరాబాద్ లో నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో ‘ఆచార్య’ మేజర్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అయితే కరోనా టెస్ట్ లో చిరంజీవి కి ముందు పాజిటివ్ అని రావడం.. ఆ తర్వాత నెగటివ్ అని తేలడం.. ఈ క్రమంలో చిరు సెట్స్ లో అడుగుపెట్టలేకపోయాడు. కాకపోతే చిరంజీవి షూటింగ్ చేయడానికి రెడీగా ఉన్నట్లు ‘సామ్ జామ్’ టాక్ షో లో షూట్ లో పాల్గొనడం ద్వారా వెల్లడైంది. అయితే కాజల్ మాత్రం ‘ఆచార్య’ సెట్స్ లో జాయిన్ అవడానికి మరికొంత సమయం తీసుకోనుందని తెలుస్తోంది. మనకందిన సమాచారం ప్రకారం కాజల్ డిసెంబర్ 5న షూటింగ్ కోసం హైదరాబాద్ రానుందట. చిరు మాత్రం ఈ రోజు నుంచి షూట్ లో పాల్గొంటాడని సమాచారం. కాజల్ సెట్స్ లో అడుగుపెట్టిన తర్వాత చిరు కాంబోలో సీన్స్ తీయడానికి కొరటాల ప్లాన్స్ వేసుకుంటున్నాడని తెలుస్తోంది.