రాహుల్ రామ కృష్ణ ‘ఆహా ‘ అనిపించడం గ్యారెంటీ!

0

ఆహా.. ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ ని అల్లు అరవింద్ మై హోమ్ గ్రూప్ తో కలసి ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ఆ తర్వాత మార్చి లో అధికారికంగా లాంచ్ చేశారు. సినీ రంగంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లతో అల్లు అరవింద్ అగ్రనిర్మాత గా కొనసాగుతున్నాడు. అల్లు అరవింద్ కి జనం నాడి పట్టడంలో మంచి పేరుంది. అందుకే ఆయన ఓ కథ ఎంపిక చేశారంటే విజయం గ్యారెంటీ అని అందరూ అంటూ ఉంటారు.
ఇప్పుడు కూడా ఓటీటీ ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పుడే డిజిటల్ వేదికలో కూడా డిమాండ్ పెరగడం మొదలైంది. ఇక కరోనా రాకతో జనాల ఎంటర్టైన్మెంట్ కి సినిమా యాప్ లే దిక్కుగా మారాయి.

దీంతో అల్లు అరవింద్ ఆహా యాప్ లో పలు సూపర్ హిట్ సినిమాలను విడుదల చేయడంతో పాటు ప్రత్యేక షోలు కామెడీ స్కిట్లు నిర్వహిస్తున్నారు. ఆహా ఓటీటీ కోసం అల్లు అరవింద్ పలువురు నిర్మాతలతో కలిసి టాలీవుడ్ దర్శకులతో పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు వేణు ఊడుగుల ఓ వెబ్ సిరీస్ ప్లాన్ నిర్మిస్తున్నారు. రాహుల్ రామకృష్ణ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రాజెక్ట్ కి వేణు దర్శకత్వం వహించడంలేదు. కేవలం నిర్మాణ బాధ్యతలనే చూడనున్నారు.

రాహుల్ రామకృష్ణ కెరీర్ షార్ట్ ఫిలిమ్స్ తోనే మొదలయింది. అతడి ‘సైన్మా ‘ షార్ట్ ఫిల్మ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఆయనకు వెబ్ సిరీస్ పాత్రలు అంటే కొట్టిన పిండే. రాహుల్ రామకృష్ణ నటుడే కాదు.. రచయిత కూడా. పెళ్లి చూపుల కోసం రెండు పాటలు కూడా రాశాడు. అర్జున్ రెడ్డి గీత గోవిందం హుషారు బ్రోచేవారెవరురా భరత్ అనే నేను తాజాగా అల వైకుంఠపురములో సినిమాలతో వరుస హిట్లు అందుకున్న రాహుల్ రామకృష్ణ వెబ్ సిరీస్ లో ఎలా ఆకట్టుకుంటాడో చూడాల్సి ఉంది.