టైటిల్ విషయంలో అక్కినేని హీరో కేర్ తీసుకోలేదా…?

0

అక్కినేని హీరో సుమంత్ కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నారు. ‘ప్రేమకథ’ ‘సత్యం’ ‘పౌరుడు’ ‘గౌరీ’ ‘మధుమాసం’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘గోదావరి’ ‘మళ్ళీరావా’ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో ‘కపటధారి’ అనే సినిమా అనౌన్స్ చేసాడు సుమంత్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ థ్రిల్లర్ ని క్రియేటివ్ ఎంటర్టైనర్స్ మరియు బొఫ్తా మీడియా బ్యానర్ పై ధనుంజయన్ నిర్మించారు. కన్నడ హిట్ సినిమా ‘కావలధారి’ సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఈ సినిమాలో నందిత శ్వేత హీరోయిన్ గా నటించింది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి అందరూ మరిచిపోయారనే అనుకునే టైమ్ లో సుమంత్ ‘కపటధారి’ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కంటే ముందే అయిపోయిందని.. త్వరలోనే మీ ముందుకు రాబోతుందంటూ వెల్లడించారు.

ఇప్పుడు లేటెస్టుగా ”కపటధారి” ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ టైటిల్ పై సినీ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని టాక్ నడుస్తోంది. సినిమా టైటిల్ బాగుంటేనే బయట ఆడియన్స్ అట్రాక్ట్ అయి సినిమా చూసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ టైటిల్ చూస్తే ఏదో డబ్బింగ్ సినిమా ఫీల్ కలుగుతోందని అంటున్నారు. అంతేకాకుండా ఇలాంటి టైటిల్స్ తో సినిమాలు తీస్తే అక్కినేని ఫ్యాన్స్ తప్ప మరెవరూ మూవీ చూడరని కామెంట్స్ చేస్తున్నారు. అసలే ఇప్పుడు సుమంత్ టైమ్ బాలేదు.. ఇలాంటి సమయంలో ‘కపటధారి’ అంటూ వస్తున్నాడు.. మరి ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుత క్రైసిస్ పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ అవడం కష్టం కాబట్టి ‘కపటదారి’ సినిమాని డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సినిమా రిలీజైతే మేకర్స్ ‘కపటధారి’ అనే టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పెట్టారనే విషయం అర్థం అవుతుంది.