అడవి బిడ్డ బిజిలీలా కియరాను చూశారా?

0

కిలాడీ అక్షయ్ కుమార్ సరసన లక్ష్మీ బాంబ్ చిత్రంలో నటించింది కియరా అద్వాణీ. దీపావళి సందర్భంగా నవంబర్ 9 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ విడుదలవుతోంది. ఓటీటీలో విడుదలవుతున్న అగ్ర హీరో సినిమా కావడంతో అంచనాలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు నవంబర్ 9 న ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్.. యుఎఇ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సమాచారాన్ని ఇటీవల విశ్లేషకుడు తరణ్ ఆదర్ష్ తన అధికారిక ట్విట్టర్ లో వెల్లడించారు.

లక్ష్మి బాంబ్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు ట్రైలర్ విడుదలవుతుందని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇచ్చారు. ట్రైలర్ ఎంతో మెప్పిస్తుంది. లక్ష్మీ బాంబ్ ట్రైలర్ చూడండి అంటూ అక్షయ్ ప్రచారం వేడెక్కిస్తున్నారు.

‘లక్ష్మీ బాంబ్’ చిత్రం నిజానికి సెప్టెంబర్ 9 న విడుదల కావాల్సి ఉండగా… దురదృష్ఠవశాత్తూ.. కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో చిత్ర నిర్మాతలు విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ – అక్షయ్ కుమార్ రొమాన్స్ ఓ రేంజులో ఆకట్టుకోనుందట. ఇది హర్రర్-కామెడీ చిత్రం. రాఘవ్ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాంచన చిత్రానికి రీమేక్ అన్న సంగతి విధితమే. ప్రచారంలో భాగంగా ఓ సాంగ్ స్టిల్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో కియరా అడవి మల్లె బిజిలీలా ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి జూట్ తో తయారు చేసిన ఆ డిజైనర్ డ్రెస్ అమ్మడి లుక్ ని అమాంతం మార్చేసింది.