Templates by BIGtheme NET
Home >> Cinema News >> యూట్యూబ్ చానెల్ పై స్టార్ హీరో రూ.500 కోట్ల పరువు నష్టం దావా

యూట్యూబ్ చానెల్ పై స్టార్ హీరో రూ.500 కోట్ల పరువు నష్టం దావా


సోషల్ మీడియా వచ్చాక ఎవరిపైనా.. ఎవరైనా దుమ్మెత్తి పోసేందుకు ఆస్కారం ఏర్పడింది.దానికి సెన్సార్ లేకపోవడంతో ప్రముఖులు సెలబ్రెటీలు ట్రోలింగ్ లకు బలైపోతున్నారు.

ముంబైలో బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య వ్యవహారంలోనూ చాలా మంది బాలీవుడ్ ప్రముఖులపై మీడియాలో సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. ఈ క్రమంలోనే సుశాంత్ సూసైడ్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పేరును ప్రస్తావించి ఓ యూట్యూబ్ చానెల్ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసింది.

దీనిపై సీరియస్ అయిన అగ్రహీరో అక్షయ్ కుమార్ ఆ యూట్యూబర్ కు రూ.500 కోట్ల పరువునష్టం దావా నోటీసులు పంపారు. యూట్యూబర్ రషీద్ సిద్ధిఖీపై ఈ దావా దాఖలు చేశారు అక్షయ్.

బీహార్ కు చెందిన యూట్యూబర్ రషీద్ సిద్ధిఖీ ‘ఎఫ్ఎఫ్ న్యూస్’ అనే యూట్యూబ్ చానెల్ ను నడిపిస్తున్నాడు. ఇందులోనే సుశాంత్ ఆత్మహత్య సమయంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆయన కుమారుడు ఆదిత్యా ఠాక్రేపై తప్పుడు ఆరోపణలు చేశాడు. దీంతో పోలీసులు సిద్దిఖీని గతంలోనే అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత అక్షయ్ కుమార్ పై కూడా కొన్ని అవమానకరమైన వీడియోలను పోస్ట్ చేశాడు. ‘ఎంఎస్ ధోని’ సినిమా సుశాంత్ కు వచ్చినందుకు అక్షయ్ అసంతృప్తిగా ఉన్నాడని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశాడు. అక్షయ్ మహారాష్ట్ర మంత్రి ఆధిత్యతో రహస్యంగా సమావేశమైనట్లు ఆరోపించారు. రియాను కెనడాకు పంపించడానికి సహాయం చేసినట్లుగా పేర్కొన్నారు. దీంతో అక్షయ్ అదే కారణంతో పరువు నష్టం నోటీసును తాజాగా పంపించాడు.