కష్టమైన టైం కాని తప్పడం లేదు!!

0

కరోనా కారణంగా గత ఆరు నెలలుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న వారు ఇప్పుడిప్పుడే మెల్లగా షూటింగ్స్ లో జాయిన్ అవుతున్నారు. ఇండియాలో కరోనా ఎక్కువగా ఉన్న కారణంగా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు విదేశాల్లో చిత్రీకరణ చేస్తున్నారు. ఇప్పటికే అమీర్ ఖాన్ మూవీ విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో అక్షయ్ కుమార్ కూడా తన బెల్ బోటమ్ మూవీ షూటింగ్ ను పున: ప్రారంభించాడు. నేటి నుండి చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

రెండు వారాల క్రితం స్కాట్ ల్యాండ్ వెళ్లిన చిత్ర యూనిట్ సభ్యులు అక్కడ నిన్నటి వరకు క్వారెంటైన్ లో ఉండి కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాత నేటి నుండి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా అక్షయ్ కుమార్ ట్విట్టర్ లో ఒక షార్ట్ వీడియోను షేర్ చేశాడు. అందులో లైట్స్.. కెమెరా.. మాస్క్ ఆన్ అండ్ యాక్షన్ అంటూ చెప్పాడు. ప్రస్తుత సమయంలో షూటింగ్ లో మాస్క్ తప్పనిసరి అయ్యింది అనేందుకు సింబాలిక్ గా మాస్క్ ఆన్ అంటూ చేర్చాడు. ఈ సమయంలో షూటింగ్ కష్టం అయినా పని జరగాలి కనుక తప్పడం లేదు అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే అక్షయ్ కుమార్ గత ఆరు నెలల సమయం వృదా అయ్యింది. బెల్ బోటమ్ చిత్రాన్ని స్పీడ్ గా పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయాలనేది ప్లాన్ గా తెలుస్తోంది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా రికార్డు సాధించిన అక్షయ్ కుమార్ వరుసగా వంద కోట్ల సినిమాలు చేస్తున్నాడు. ఓటీటీలో విడుదలైనా కూడా ఈయన సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. కనుక ఈయన సినిమాలను వందల కోట్లకు ఓటీటీ వారు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారట. అందుకే బెల్ బోటమ్ సినిమాను త్వరగా పూర్తి చేసి మరో సినిమాను చేయాలని ఆయన భావిస్తున్నాడు.

Lights Camera Mask On and Action