‘అల్ట్రా స్టైలిష్’ లుక్కులో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్న స్టైలిష్ స్టార్..!

0

ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండగా సినీతారల నుండి సామాన్య ప్రజల వరకు అందరూ ఎవరిళ్ళకు వారే అంకితమయ్యారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ లాక్ డౌన్ లో సోషల్ మీడియాలో అలర్టుగా ఉంటున్నాడు. తనకు సంబందించిన అన్నీ విషయాలు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తున్నాడు. తాజాగా బన్నీ పుష్ప సినిమా కోసం పెంచిన గడ్డం లుక్ చూసే ఉంటారు. అయితే ఇప్పుడు బన్నీ తన హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ మార్చి అల్ట్రా స్టైలిష్ లుక్కులో దర్శనమిచ్చాడు. అప్పుడే ఆయన ఆఫీస్ నుండి బయటికి వచ్చి నిలబడి పోజిచ్చినట్లుగా కనిపిస్తున్న స్టైలిష్ లుక్ చూస్తూ ఫ్యాన్స్ సంబరపడి పోతున్నారు. బన్నీకి ఇదేం కొత్త కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ ఆల్రెడీ బన్నీకి స్టైలిష్ స్టార్ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. ప్రతీ సినిమాలో కొత్త స్టైల్స్ చూపించినట్లే లాక్ డౌన్ లో కూడా అభిమానులకు ఉత్సాహాన్నిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ చిత్రాల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 20వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పుష్ప అనే టైటిల్ ఖరారు చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అయితే సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కాబట్టి హ్యాట్రిక్ కొడతారని ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసను మాట్లాడుతూ నెరిసిన గడ్డంతో లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేటెస్ట్ ట్రెండీ బ్యూటీ రష్మిక మందానను హీరోయినుగా నటించనుంది. ఈ నేపథ్యంలో బన్నీ సుక్కు ఈ పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి బన్నీ ఎప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.