మాజీ ప్రియుడిపై కేసు నమోదు చేసిన అమలాపాల్..!

0

దక్షిణాది కథానాయిక అమలాపాల్.. దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటే అయింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమలాపాల్ ముంబైకి చెందిన గాయకుడు భవీంధర్ సింగ్ తో ప్రేమాయణం సాగించింది. పేరు వెల్లడించనప్పటికీ తనను బాగా అర్థం చేసుకొనే వ్యక్తి ఇప్పుడు తన లైఫ్ లో ఉన్నాడంటూ ఓ మూవీ ప్రమోషన్ లో అమల పేర్కొంది. ఇదే క్రమంలో బాయ్ ఫ్రెండ్ భవీంధర్ సింగ్ తో అమలాపాల్ వివాహం జరిగిపోయిందని.. పెళ్లి ఫోటోలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి. అందులో వీరిద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉండటంతో ఈ వార్తలు నిజమే అనుకోని పలువురు ఈ జంటకు విషెస్ కూడా చెప్పారు. అయితే ఆ ఫోటోలను వెంటనే ఆ ఫొటోలను భవిందర్ సింగ్ ఇంస్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశాడు. ఆ తరువాత వాటిపై స్పందించిన అమలాపాల్.. పెళ్లి వార్తల్లో నిజం లేదని అవి ఓ ప్రకటన కోసం కోసం తీశారని తెలిపింది. అయితే అది జరిగిన ఇన్నాళ్లకు భవిందర్ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై అమలాపాల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయింది.

చెన్నై కోర్టులో తన ఫొటోలను అనుమతి లేకుండా వాడటంతో పాటు పెళ్లైందంటూ పుకార్లు సృష్టించిన భవిందర్ పై పరువు నష్టం కేసు వేయడానికి అనుమతి ఇవ్వాలని అమలాపాల్ కోరింది. కేసు వివరాలు విన్న జడ్జ్ భవిందర్ సింగ్ పై కేసు వేయడానికి అనుమతినిచ్చారు. అంతేకాకుండా దీనిపై సమాధానం చెప్పాలంటూ న్యాయస్థానం భవీందర్ కు నోటీసులు కూడా జారీ చేసింది. ఎప్పుడో జరిగిన విషయాన్ని అమలాపాల్ ఇప్పుడు బయటకు తీసుకురావడం ఏంటి.. అది కూడా బాయ్ ఫ్రెండ్ పై కేసు వేయడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అమలాపాల్ భవీంధర్ సింగ్ తో కొన్నాళ్ళు రిలేషన్ షిప్ కొనసాగించిన తర్వాత అతనితో కూడా విడిపోయిందని.. అందుకే ఇప్పుడు మాజీ బాయ్ ఫ్రెండ్ పై రివేంజ్ తీర్చుకుంటోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్లనుందో చూడాలి.