బిగ్ బీ రెడీ అవుతున్నాడు…!

0

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి(కేబీసీ)’ రీయాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. టెలివిజన్ ప్రేక్షకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ కార్యక్రమం 11 సీజన్లు పూర్తి చేసుకుని అతి త్వరలోనే తర్వాతి సీజన్ ని స్టార్ట్ చేయనుంది. ఇక ఇటీవల కరోనా నుంచి బయటపడిన అమితాబ్ కేబీసీ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ కేబీసీ షోను తిరిగి ప్రారంభిస్తామని.. అతి త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు అమితాబ్ వెల్లడించారు.

అయితే కరోనా పరిస్థితుల్లో మీరు మళ్లీ షూటింగ్ చేయడం అవసరమా అంటూ కామెంట్స్ వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై అమితాబ్ స్పందిస్తూ ‘ఇలాంటివి మాటలు మీ దగ్గరే పెట్టుకోండి. ప్రాబ్లమ్ వచ్చిందని అక్కడే ఆగిపోతామా.. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్ని జాగ్రత్తలతో 2 రోజుల షెడ్యూల్ ను ఒక్క రోజులోనే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే టెలివిజన్ పై కనిపిస్తా’ అని పేర్కొన్నారు.

కాగా ఇటీవల అమితాబ్ ఫ్యామిలీ సభ్యులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. జయా బచ్చన్ మినహా అమితాబ్ – అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యారాయ్ – ఆరాధ్య లకు కరోనా సోకింది. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకొని వీరందరూ పూర్తిగా కరోనా నుంచి బయటపడ్డారు. అయితే అమితాబ్ కి కరోనా రావడానికి కారణం ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో అని వార్తలు వచ్చాయి. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన అమితాబ్.. కేబీసీ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ షూట్ సమయంలో అక్కడికి వచ్చిన సిబ్బంది ద్వారా ఆయనకు కరోనా సోకిందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు మళ్ళీ అమితాబ్ కేబీసీ షూటింగ్ లో పాల్గొంటాను అని చెప్పడంతో ఆయన అభిమానులు ఆందోళనపడుతున్నారు.