మీలాంటి హాఫ్ మైండ్ గాళ్లకు ఇదే నాసమాధానం : అనసూయ

0

అనసూయ సోషల్ మీడియాలో తనకు నెగటివ్ కామెంట్స్ చేసే వారికి సీరియస్ గా కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. తన గురించి తన వ్యక్తిగత విషయాల గురించి తన కుటుంబం గురించి ఎవరైనా తీసి కామెంట్ చేస్తే ఖచ్చితంగా స్పందిస్తుంది. తాజాగా ఈమె భర్త భరద్వాజ్ పుట్టిన రోజు సందర్బంగా గోవాకు హాలీడే వెళ్లింది. అక్కడ ఉన్నప్పటి ఫొటోలను షేర్ చేసింది. షార్ట్ స్కర్ట్ వేసుకుని ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా అనసూయ ఒక ఫొటోను షేర్ చేసి హిందూ సముద్రం వద్ద అంటూ కామెంట్ పెట్టింది. ఆ ఫొటోకు చాలా మంది గోవాలో హిందూ మహా సముద్రం ఎక్కడిది అమ్మడు అంటూ ప్రశ్నించారు. ఆమాత్రం తెలియకుండా ఎలా ఇంత స్టార్ అయ్యావని మరి కొందరు కామెంట్ చేయడం మొదలు పెట్టారు.

తన పోస్ట్ పై వస్తున్న కామెంట్ కు చాలా సీరియస్ అయ్యింది. హాఫ్ మైండ్ ఉన్న వారికి నేను సమాధానం చెప్పను. ఇదే వారికి సమాధానం అంటూ విక్కీ పీడియాలో హిందూ మహా సముద్రంకు సంబంధించిన సమాచారంను స్క్రీన్ షాట్ తీసి పెట్టింది. అరేబియా సముద్రం హిందూ మహా సముద్రంలోని ఒక భాగం అనే విషయం తెలియని మీరు నాకు కామెంట్ పెడుతున్నార అంటూ తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది. అనసూయ సమాధానంకు అంతా ఫిదా అవుతున్నారు. మీరు నాలెడ్జ్ పరంగా కూడా ఇంత సూపర్ అనుకోలేదు మేడం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.