కాస్టింగ్ కౌచ్ పై నిజాలు దాచేసిన అనుష్క?

0

కాస్టింగ్ కౌచ్ అనేది దశాబ్ధాలుగా అన్ని పరిశ్రమల్లో ఉన్నదే. లేదు అంటే అంతకుమించిన అబద్ధం వేరొకటి ఉండదని చాలా మంది కథానాయికలు బహిరంగంగా అంగీకరించారు. తమకు అలాంటిదేమీ జరగలేదని చెప్పిన నాయికలు .. వేధింపులు ఇక్కడ సహజమేనని చెబుతుంటారు. తాజాగా ఈ జాబితాలోకే చేరింది అనుష్క శెట్టి. టాలీవుడ్ లో తనకు కూడా ఇలాంటి వేధింపులు తప్పలేదని షాక్ ఇచ్చింది స్వీటీ.

నిశ్శబ్దం రిలీజ్ కి రెడీ అవుతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. అయితే కొత్తగా అవకాశాలు వెతుక్కునే భామలకే ఈ సమస్య ఎక్కువ అని వెల్లడించింది. తాను కూడా కెరీర్ ఆరంభం టాలీవుడ్ లో అలాంటిది ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది.

సూటిగా ఉండడం.. ధైర్యంగా నో చెప్పడం వల్లనే తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపింది. అయితే చాలా కాలం క్రితం అనుష్క సహా కొందరు టాలీవుడ్ నాయికలపై మాఫియా తరహా బెదిరింపులు వేధింపులు ఎదురయ్యాయని ప్రచారం సాగింది. దాని గురించి ఎలాంటి ప్రస్థావనా తాజా ఇంటర్వ్యూలో లేదు.