సూట్ కేస్ లైఫ్ అంటే ఏమిటో సామ్ ని అడగాలి

0

బిజీ లైఫ్ పర్యవసానం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. నగర జీవితాల్లో బిజీనెస్ ఫ్యామిలీ లైఫ్ కి ఆటంకం తెస్తుంది. అయితే సెలబ్రిటీ జీవితాల్లోనూ ఇది చాలా కామన్. అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాతా కెరీర్ పరంగా బిజీ బిజీ. తన కెరీర్ చాలా ప్రత్యేక దశలో ఉంది. ఇటీవల కొన్ని ఉత్తమ ప్రాజెక్టులను చేస్తోంది. అయితే ఓ బేబి తర్వాత సామ్ ఏ తెలుగు చిత్రానికీ సంతకం చేయలేదు. కానీ బుల్లి తెర.. ఓటీటీ రియాలిటీ షోలతో బిజీగా ఉంది.

ప్రస్తుతం ఆహా కోసం `సామ్ జామ్` అనే షో చేస్తున్నారు సమంత. మొదటి ఎపిసోడ్ ఇప్పటికే విజయ్ దేవరకొండతో పూర్తయింది. రౌడీతో చిట్ చాట్ లో చాలా సంగతులే బయటపడ్డాయి. ఈ లాక్ డౌన్ సమయంలో తనకు నచ్చినట్టు పూర్తి జీవితాన్ని గడిపానని సామ్ వెల్లడించింది. . కావాల్సినంత సమయం చేతికి చిక్కిందని తెలిపింది.

చాలా కాలంగా బిజీగా ఉన్నందున ఎప్పుడూ సూట్ కేస్ జీవితానికి అలవాటు పడిపోయానని తెలిపింది. ఈ లాక్ డౌన్ విరామంలో ఆమెకు తోటపని తెలిసింది. సంతోషంగా పని చేయడానికి అవకాశం దొరికిందట. ఇంటి పని వంట పని చేయటానికి అవకాశం దొరికిందని సామ్ వెల్లడించారు.