సన్నజాజి నడుముతో సంపకే బాలా

0

సన్నజాజి నడుముతో సంపుతోంది ఎవరీ చిన్నది? అంటారా.. ఇంకెవరు బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి వారసురాలు ఆథియా శెట్టి. ఇంతకుముందు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ క్రికెటర్ కె.ఎల్.రాహుల్ తో నిండా ప్రేమలో మునిగిందని ప్రచారమైంది. ఆ ఇద్దరూ జంటగా షికార్లు చేస్తున్న ఫోటోలు ఇంతకుముందు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఆథియా మంచి జతగాడినే వెతుక్కుంది అంటూ బోయ్స్ పంచ్ లు వేశారు.

అదంతా సరే కానీ.. ఆథియా సోషల్ మీడియాల్లోనూ జరంత స్పీడ్ గానే ఉంది. తాజాగా ఆథియా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. సన్నజాజి నడుమును ఎంతో వయ్యారంగా ఎలివేట్ చేస్తూ ఈ కుర్రబ్యూటీ ఇచ్చిన ఫోజు కంపనాలు పుట్టిస్తోంది.

పింక్ టాప్ లో దుమారం రేపింది. లేలేత అందాలతో వయ్యారాల వడ్డనలు చేసేందుకు ఈ భామ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇక ఈ భామ ఒక స్టార్ హీరో వారసురాలే అయినా ఇండస్ట్రీలో స్నేహాలు తక్కువేనని తాజాగా వెల్లడించింది. ఎక్స్ ట్రావర్ట్ లా నటించినా కానీ ఎవరూ స్నేహితులు కాలేదట. తనకు సిగ్గు కాస్త ఎక్కువేనని కూడా చెప్పింది. ఇక ఆథియాకు సరైన హిట్లు లేక ఆఫర్లు లేవు. కానీ బోయ్ ఫ్రెండ్ తో షికార్లు చేస్తూ మాత్రం అందరికీ టచ్ లో ఉంది. హీరో చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆథియా ముబారకన్ -నవాబ్ జాదే-మోతిచూర్ చకన్నాచూర్ అనే చిత్రాల్లో నటించింది.