యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

AVATAR 2: THE WAY OF WATER Trailer: అవతార్.. ఈసారి నీటి కోసం ఈ యుద్ధం? అద్భుతం

0

AVATAR 2: THE WAY OF WATER Trailer: ‘టైటానిక్’లాంటి ప్రపంచ ప్రఖ్యాత చిత్రాన్ని తీసి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన దర్శకుడు ‘జేమ్స్ కామెరూన్’. అలాంటి దర్శకుడి నుంచి ఇదివరకు వచ్చిన ‘అవతార్’ మూవీ ఎంతో పెద్ద హిట్ అయ్యి ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తోందే ‘అవతార్2’

పండోరా అనే గ్రహంపై అక్కడి ఆదిమ మనుషులకు, మన భూమ్మీద ఉన్న మనుషులకు మధ్య జరిగిన యుద్ధాన్ని జేమ్స్ కామెరూన్ ఒక విజువల్ వండర్ గా సృష్టించి ప్రేక్షకులను కట్టిపడేశాడు. దాన్ని ఇప్పుడు కొనసాగిస్తూ మరో ‘అవతార్2’ను రూపొందించాడు.

అవతార్ సీక్వెల్ గా వస్తోన్న ‘అవతార్2’ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని ఈ ట్రైలర్ లో ప్రేక్షకులకు చూపించాడు జేమ్స్ కామెరూన్. ఈ ట్రైలర్ చూస్తే ఒక కొత్త లోకంలో మనం విహరిస్తున్నట్టే కనిపిస్తుంది. ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. యూట్యూబ్ లో ఇప్పుడు ఈ ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది.

2154 సంవత్సరంలో నడిచే ‘అవతార్2’ కథలో భూమి ఎప్పటిలాగానే ఉంటుంది. మనుషులు కూడా అలానే ఉంటారు. కానీ భూమిపై సహజ వనరులు అయిపోవడంతో ఇతర గ్రహాల మీద ఉన్న సహజ సంపదపై భూమిపై ఉండే కార్పొరేట్ కంపెనీల కన్ను పడుతుంది. ఈ క్రమంలోనే అంతరిక్షంలో ఎక్కడో దూరంగా ఉన్న ‘పండోరా’ గ్రహం గురించి శాస్త్రవేత్తలకు తెలియడం.. వారు ఆ గ్రహంపైకి దండెత్తడం.. ఒకసారి ఓడిపోవడాన్ని తొలి అవతార్ లో చూపించారు.

ఇక రెండో అవతార్ 2 సినిమాలో ఈసారి సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టు తెలుస్తోంది. నీటి కోసం యుద్ధం జరుగుతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నీటిలోనే ఈసారి మనుషులతో యుద్ధం జరుగుతుందని విజువల్స్ ను బట్టి అర్థమవుతోంది. ట్రైలర్ లో విచిత్రమైన చెట్లు, జంతువులు, ఎగిరే గుర్రాలు, మృగాలు మొత్తంగా ఒక అద్భుతాన్నే జేమ్స్ కామెరూన్ ఆవిష్కరించారు. 2009లో తొలి ‘అవతార్’ రాగా.. ఇప్పుడు అవతార్ 2 రావడానికి 13 ఏళ్లు పట్టింది. మరి ఇది ఎలా ఉండబోతోందన్నది వేచిచూడాలి. ట్రైలర్ మాత్రం అంచనాలు డబుల్ చేసింది.

అవతార్ 2ను ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.