నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ఫుల్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో శ్రీలీల ఒక కీలక పాత్ర పోషించగా అర్జున్ రామ్ పాల్ విలన్ గా కనిపించారు.
థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో నేలకొండ భగవంత్ కేసరిగా బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, అనిల్ రావిపూడి అద్భుత టేకింగ్ కి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక మొత్తంగా గడచిన నాలుగు రోజుల్లో భగవంత్ కేసరి మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 106. 2 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. మరోవైపు యుఎస్ఏ లో కూడా భగవంత్ కేసరి అదరగొడుతోంది. ఇక రాబోయే రోజుల్లో ఈ మూవీ ఇంకెంతమేర రాబడుతుందో చూడాలి.