విజయదశమికి గట్టి షాకివ్వబోతున్న NBK

0

నందమూరి బాలకృష్ణ ఇటీవల ఏం చేసినా సంచలనమే అవుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైన బాలయ్య ఈ దసరాకు భారీ హంగామా చేయబోతున్నారన్నది అభిమానుల్లో హీటెక్కిస్తోంది. తనదైన ప్రతిభ.. చేతలతో ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఆయన ఉన్నట్టుండి రాక్ స్టార్ గా మారుతుండడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. లాక్ డౌన్ పీరియడ్ లో ఘంటసాల పాపులర్ సాంగ్ `శివ శంకరి శివానంద లహరి`ని ఆలపించడమే కాకుండా దాన్ని నెట్టింట వైరల్ అయ్యేలా చేశారు బాలయ్య. దీనిపై విమర్శలు వెల్లువెత్తినా తనకు నచ్చిందే చేస్తానని నిరూపించారు.

తాజాగా 15 ఏళ్ల క్రితం కారణాంతరాన ఆగిపోయిన తన డ్రీమ్ ప్రాజెక్ట్ `నర్తనశాల`లకు సంబంధించిన 17 నిమిషాల ఫుటేజీని ఈ దసరాకు రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. సౌందర్య ప్రమాద వశాత్తు మరణించడంతో ఈ చిత్రాన్ని బాలకృష్ణ అర్థాంతరంగా ఆపేశారు. ఈ విజయదశమిరోజు ఈ మూవీకి సంబంధించిన 17 నిమిషాల వీడియో క్లిప్ ని శ్రేయాస్ ఈటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ వీడియో తో పాటు మరో రెండు ఇంగ్లీష్ సాంగ్స్ ని కూడా రిలీజ్ చేస్తున్నారట.

ఈ రెండు పాటల్ని స్వయంగా బాలకృష్ణ పాడటం విశేషం. ఇంగ్లీష్ పాట పాడాలని ఎప్పి నుంచో బాలయ్యకు కోరిక వుందట. ఆ కోరిక ఇప్పటికి తీరిందని చెబుతున్నారు. కోరస్ తో కలిసి బాలయ్య పాడిన ఈ ఇంగ్లీష్ సాంగ్స్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయబోతున్నారట. దీనికి ఎస్వీ కృష్టారెడ్డికి లింక్ వున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన `నర్తన శాల` ప్రమోషనల్ వీడియోల్లో ఎస్వీ కృష్టారెడ్డి కనిపించడం.. ఆ తరువాత వీడియో ఎండింగ్లో టాప్ హీరో చిత్రంలోని ఓ పాటని ప్లే చేయడంతో ఆ అనుమానాలకు బలం చేకూరింది. ఈ దసరా బాలయ్య ఇచ్చే షాక్ కు ఫ్యాన్స్ బీ రెడీగా వుండాల్సిందే అన్నమాట.