Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుకుమార్ తో బాలయ్య స్ట్రాంగ్ బజ్..

సుకుమార్ తో బాలయ్య స్ట్రాంగ్ బజ్..


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ హ్యాట్రిక్ హిట్ చిత్రం “భగవంత్ కేసరి” కోసం అందరికీ తెలిసిందే. మరి దీనికి ముందు కూడా బాలయ్య సాలీడ్ లైనప్ ని మనం చూడవచ్చు. దీనితో ఇప్పుడు అయితే మన సీనియర్ హీరోస్ లో మళ్లీ తన పీక్ స్టేజి లోకి రాగా ఇప్పుడు తన లైనప్ కి సంబంధించి ఓ క్రేజీ అండ్ సెన్సేషనల్ బజ్ అయితే వినిపిస్తోంది.

మరి దీని ప్రకారం ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తన పుష్ప తో ముద్ర వేసిన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తో అయితే బాలయ్య వర్క్ చేయనున్నట్టుగా ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరి ఈ ఊహించని కాంబినేషన్ అయితే ఆల్ మోస్ట్ ఫిక్స్ అని దీనిపై త్వరలోనే అధికారిక అప్డేట్ కూడా రావచ్చని తెలుస్తోంది. అయితే ఈ సినిమా బాలయ్య 110వ సినిమాగా తెరకెక్కనుందని టాక్. మొత్తానికి అయితే బాలయ్య మాత్రం తన కెరీర్ ఒకో సినిమాతో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ హై ని ఇస్తున్నారు అని చెప్పడంలో డౌట్ లేదు.