కాజల్ పెళ్లి..యంగ్ స్టర్ కు అందిన ఆహ్వానం

0

తెలుగు సినీ ప్రేక్షకులను తన గ్లామర్తో మైమరిపించిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ నెల 30 న పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడు ముంబయికి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్చును ఆమె ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. వీళ్లిద్దరూ ఒకే స్కూల్లో చదివారని.. చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని.. ఆ తర్వాత ప్రేమించుకున్నారట. ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా పూర్తయ్యింది. పెళ్లి మాత్రం చాలా సింపుల్ గా జరుగబోతున్నదట. ఇరు కుటుంబాలకు చెందిన 30 నుంచి 40 మంది మాత్రమే ఈ వేడుకకు హాజరు కాబోతున్నారట.

ఇరు వర్గాల కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. అయితే టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆహ్వానం వచ్చినట్టు టాక్. వీరిద్దరూ సీత కవచం చిత్రాల్లో కలిసి నటించారు. అయితే కాజల్కు తెలుగు సినీ పరిశ్రమలో బెల్లంకొండ శ్రీనివాస్ బెస్ట్ ఫ్రెండ్. కాజల్ ఎంగేజ్మెంట్కు కూడా అతడు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. బెల్లంకొండ కాజల్ ప్రేమించుకున్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని వాళ్లు కొట్టి పారేశారు. ఈ క్రమంలో బెల్లంకొండ కాజల్ పెళ్లికి వెళ్తున్నట్లు ఫిలింనగర్లో టాక్ వినిపిస్తున్నది. ఇప్పటికే మెగాస్టార్ ఆచార్యలో కాజల్ నటిస్తున్నది. మరికొన్ని తమిళ సినిమాలకు కూడా ఆమె సైన్ చేసింది. పెళ్లి తర్వాత కూడా తాను సినిమాల్లో నటిస్తానని చెప్పింది.