Templates by BIGtheme NET
Home >> Cinema News >> బాలయ్య ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రావిపూడి!

బాలయ్య ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రావిపూడి!


నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీ లీల కీలక పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమా వచ్చే వారం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ గత చిత్రాలు అఖండ మరియు వీర సింహారెడ్డి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న బాలకృష్ణతో అనిల్ రావిపూడి రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి మరో విజయాన్ని సొంతం చేసుకోబోతుందని నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఈ సినిమాతో బాలకృష్ణ ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ ఆయన అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి గత చిత్రం నిరాశ పరచడంతో ఈ సినిమా పై ఎక్కువ ఫోకస్ పెట్టి మరి రూపొందించాడని సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని మొదటి నుండి ప్రచారం జరుగుతోంది. రెండు విభిన్నమైన పాత్రలు లేదా రెండు విభిన్నమైన గెటప్స్ లో బాలయ్య కనిపించబోతున్నాడు అనేది కన్ఫామ్.

ట్రైలర్లో మరియు ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లో ఒక్క లుక్ మాత్రమే రివిల్ చేయడం జరిగింది. మరో లుక్ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా లో మాత్రమే ఆ లుక్ చూడబోతున్నామని దర్శకుడు అనధికారికంగా చెబుతున్నాడు. ఇక దసరా రోజు ప్రత్యేకంగా ఈ సినిమా కోసం రూపొందించిన రీమిక్స్ సాంగ్ ని సినిమాకు జత చేయబోతున్నారట. అంటే సినిమా విడుదలైన దాదాపు నాలుగు ఐదు రోజుల తర్వాత ఒక ప్రత్యేకమైన పాటను కలుపుతున్నారు.

ఆ పాట చాలా బాగుంటుందని.. సినిమాకు హైప్ తీసుకొస్తుందని మేకర్స్ ధీమాతో ఉన్నారు. బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్ దంచవే మేనత్త కూతురా కి రీమిక్స్ గా ఆ పాట ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ విషయమే ఎలాంటి క్లారిటీ లేదు. మొత్తానికి బాలయ్య రెండవ గెటప్ గురించి అలాగే సాంగ్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభిమానులను టెన్షన్తో.. ఆసక్తితో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తున్నాడు. మొత్తానికి సినిమాకు కావలసినంత బజ్ క్రియేట్ అయింది. దీంతో భారీ ఓపెనింగ్స్ నమోదు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది అంటూ బాక్స్ ఆఫీస్ వర్గాల వారు అభిప్రాయం చేస్తున్నారు.