Templates by BIGtheme NET
Home >> Cinema News >> సినిమాకు ఆ టైటిల్ ఎందుకంటే..?

సినిమాకు ఆ టైటిల్ ఎందుకంటే..?


బాలకృష్ణతో సినిమా తన లక్ అని అంటున్న అనీల్ రావిపుడి ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన తాను దర్శకుడికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ చూసి ఆయన మీద అభిమానం మరింత పెరిగిందని అన్నారు. ఆయనతో సినిమా చేసిన ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేశానని అన్నారు ఇది ఎప్పటికీ మర్చిపోనని అన్నారు అనీల్ రావిపుడి. భగవంత్ కేసరి హై యాక్షన్, ఎమోషనల్ మూవీగా వస్తుందని దర్శకుడిగా తనని ఒక మెట్టు ఎక్కించుకునేలా ఈ ఆఫర్ ఇచ్చినందుకు థాంక్స్ అని అన్నారు అనీల్ రావిపుడి.

బాలయ్య సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని అనుకున్నాం.. సినిమా ఫారెస్ట్ ట్రైబల్ బ్యాక్ డ్రాప్ తో కథ అనుకున్నాం పేరులో పవర్ ఉండాలని కథకు తగినట్టుగా కేసరి అదే భగవంత్ కేసరి అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టామని అన్నారు. అంతేకాదు ఎన్.బి.కె నెవర్ బిఫోర్ అనేలా ఈ సినిమాలో ఆయన 3 డిఫరెంట్ వేరియెషన్స్ ఉన్న పాత్రల్లో నటించారని చెప్పారు. రెండు పాత్రలు రివీల్ చేయగా 3వ పాత్ర సినిమాలో సర్ ప్రైజ్ చేస్తుందని అన్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ గారిని కొత్తగా చూస్తారని అన్నారు అనీల్ రావిపుడి.

ఈ సినిమాతో శ్రీలీల నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని అన్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిన ఆమె డ్యాన్స్, సాంగ్స్ బాగా చేస్తుంది. భగవంత్ కేసరి నుంచి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. సినిమాలో నటించిన కాజల్ కూడా సీనియర్ యాక్ట్రెస్ గా రన్ టైం గురించి ఆలోచించకుండా కథకు తగినట్టుగా మెచ్యురిటీ గా నటించిందని అన్నారు. కథను నమ్మి కాజల్ సినిమా చేసిందని అన్నారు.

సినిమా చూసిన తర్వాత కేసరి, విజ్జి పాప పాత్రలు గుర్తుంటాయి. స్క్రీన్ ప్లే బాగా కుదిరిందని అన్నారు. సినిమాకు తన టెక్నికల్ టీం కూడా బాగా సపోర్ట్ అందించారని అన్నారు. తన సాంకేతిక వర్గం మొత్తం ఈ సినిమాకు తమ బెస్ట్ వర్క్ ఇచ్చారని దాని వల్ల సినిమా ఇంకా బాగా వచ్చిందని చెప్పారు. భగవంత్ కేసరి ఈ పేరు చానా యేండ్లు యాదుంటాడి అంటూ సినిమాలోని డైలాగ్ బ్రో ఐడోంట్ కేర్ డైలాగ్ చెప్పి ఫ్యాన్స్ ని అలరించారు అనీల్ రావిపుడి. అంతేకాదు ఈ సందర్భంగా డైరెక్షన్ మాత్రమే కాదు నటుడిగా కూడా చేస్తానని కాకపోతే ఐదారేళ్లు టైం తీసుకుంటానని అన్నారు. సో ఐదారేళ్ల తర్వాత కచ్చితంగా అనీల్ ని స్క్రీన్ వెనుక కాదు స్క్రీన్ మీద కూడా చూసే అవకాశం ఉందని తెలుస్తుంది.