భూమి బద్ధలై మైండ్ బ్లాకవ్వాలి!

0

బాలీవుడ్ అందాల నాయిక భూమి పెడ్నేకర్ ప్రయోగాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇటీవల ఈ అమ్మడు వరుసగా ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుని అద్భుత నటనతో కాంపిటీషన్ లోకి దూసుకొచ్చింది. కపూర్ లు.. ఖాన్ లు సిన్హాల నటవారసురాళ్లు ఉన్న చోట ఔట్ సైడర్ గా భూమి దూసుకురావడం ఆసక్తికరం. ఈ అమ్మడు ముంబైలో నివశించే ఒక మాజీ కార్మిక మంత్రి కుమార్తె. యష్ రాజ్ సంస్థలో అసిస్టెంట్ గా పని చేసి అటుపై అదే సంస్థలో కథానాయికగా కెరీర్ ని ప్రారంభించింది. ఇక తొలి నుంచి ఈ అమ్మడు ప్రయోగాత్మక పంథానే అనుసరించడంతో నటిగా మంచి పేరొచ్చింది.

ఇటీవల భూమి పెడ్నేకర్ ఇన్ స్టాలో వరుస ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తోంది. మాస్క్ ధరించినా.. కెమెరా చేతపట్టి ఫోటోగ్రఫీతో బిజీ అయిపోయినా అదిరిపోయే కాన్సెప్ట్ ఫోటోషూట్ తో హీట్ పెంచేస్తోంది. తాజాగా చేతిలో కొడాక్ కెమెరాతో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజు యువతరంలో వైరల్ గా మారింది. `స్మైల్ ప్లీజ్` అన్న క్యాప్షన్ కి తగ్గట్టే భూమి స్మైల్ ఇచ్చిన తీరు ఇంట్రెస్టింగ్.

తాజా ఫోటోలో సంథింగ్ స్పైసీగా భూమి డ్రెస్సింగ్ సెన్స్ కుర్రాళ్లకు వేడి పుట్టిస్తోంది. ఇక ఈ అమ్మడు కొంకణా సేన్ తో కలిసి నటించిన తాజా చిత్రం `డాలీ కిట్టీ ఔర్ వో ఛమక్ తే సితారే ఈ సెప్టెంబర్ లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. తదుపరి పలు భారీ చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. మహమ్మారీ వల్ల షూటింగులు వాయిదా పడిన సంగతి తెలిసిందే.