టి రేప్ కేసులో అంతా బిగ్ షాట్స్.. అంతా బిక్కు బిక్కు!

0

139 మంది ప్రముఖులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పదేళ్ల పాటు ఈ దురాగతం సాగించారని ఓ నటి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇటీవల కలకలం రేపింది. అయితే ఈ కేసులో ఎవరినీ వదిలి పెట్టకుండా అందరిపైనా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి దర్యాప్తు సాగిస్తుండడం.. ఇది నిర్భయ కేసు కావడంతో సదరు సెలబ్రిటీల్ని పరుగులు పెట్టించే వ్యవహారమేనని చర్చ సాగుతోంది.

5వేల సార్లు తనపై అత్యాచారం జరిగిందని సదరు నటి ఫిర్యాదు చేయడం చూస్తుంటే ఈ కేసును పోలీసులు సీరియస్ గానే దర్యాప్తు సాగిస్తున్నారట. దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 113 పేజీల ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి లోతుగానే పరిశోధిస్తున్నారు. ఆసక్తికరంగా ఇందులో చాలా మంది ప్రముఖుల పేర్లతో జాబితా రెడీ అయ్యిందని తెలుస్తోంది. 25 ఏళ్ల యువతి నల్గొండ జిల్లా మిర్యాలగుడ వాస్తవ్యురాలు ప్రతిదీ పోలీసులకు పూస గుచ్చి చెప్పారట.

ఇప్పటికే ఈ జాబితాలో పాపులర్ తెలుగు యాంకర్ సహా చాలా మంది సినీటీవీ నిర్మాతలు.. ఒక కెమెరామెన్.. ఒక పాపులర్ టీవీ ఛానల్ రిపోర్టర్ .. మాజీ ఎంపీ అతని పిఎ.. ఒక వైద్యుడు .. చాలా మంది ఎస్.ఎఫ్.ఐ విద్యార్థి నాయకులు ఉన్నారని తెలిసింది. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు నిజాయితీగా దర్యాప్తు సాగితే పెద్ద చేపల పేర్లు బయటికి వస్తాయి.. కాబట్టి మధ్యలోనే నీరుగారిపోవడం చూసేదే. కానీ ఈసారి ఈ కేసులో పోలీసులు ఏం చేయబోతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే అందరూ బిగ్ షాట్స్. కాబట్టి కేసును తప్పు దారి పట్టించడం లేదా వీగిపోయేలా చేయడం కోసం చాలా మంది చాలారకాలుగా ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు.