పునర్నవి ‘కమిట్ మెంటల్’ టీజర్..!

0

‘బిగ్ బాస్’ ఫేమ్ పునర్నవి భూపాళం – ఉద్భవ్ రఘునందన్ ప్రధాన పాత్రలో ”కమిట్ మెంటల్” అనే వెబ్ సిరీస్ రూపొందిన సంగతి తెలిసిందే. ఇటీవల పునర్నవి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ద్వారా ఈ సిరీస్ కి ఇప్పటికే కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. పునర్నవికి ఉద్భవ్ తో ఎంగేజ్మెంట్ జరిగిందనే అర్థం వచ్చే విధంగా పోస్టులు పెట్టి చివరకు ఇది ‘కమిట్ మెంటల్’ వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్ అని కూల్ గా చెప్పింది. తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం రూపొందించబడిన ఈ వెబ్ సిరీస్ కి ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. ఇటీవలే హీరో శ్రీవిష్ణు ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. నవంబర్ 13 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానున్న ‘కమిట్ మెంటల్’ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు.

‘కమిట్ మెంటల్’ టీజర్ ఈ వెబ్ సిరీస్ లోని అను మరియు ఫణి పాత్రల స్వభావాలను వెల్లడిస్తోంది. అను పాత్రలో పునర్నవి.. ఫణి పాత్రలో ఉద్భవ్ రఘునందన్ కనిపిస్తున్నారు. వేరు వేరు దేశాల్లో ఉన్న ఈ ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటున్నట్లు టీజర్ లో చూపించారు. తెల్లారి ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కోసం అర్థరాత్రి వరకు వర్క్ చేస్తున్న అను కి ఫణి కాల్ చేసి ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ లోని అన్ రీడ్ మెసేజ్ లను చదివి వినిపిస్తూ ఉంటాడు. అయితే ఉదయాన్నే ప్రెజెంటేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న అను మాత్రం వాటిని వినే మూడ్ లేదనట్లు బిహేవ్ చేస్తుంది. అయినప్పటికీ అవేమీ పట్టించుకోని ఫణి ఆమెను విసిగిస్తున్నట్లు టీజర్ లో చూపించారు. ఈ సిరీస్ ‘పర్మినెంట్ రూమ్ మేట్స్’ వెబ్ సిరీస్ కి తెలుగు రీమేక్ గా రానుంది. ప్రముఖ మీడియా ప్రొడక్షన్ హౌస్ తమడా నిర్మాణ భాగస్వామ్యంలో టీవీఎఫ్ (ద వైరల్ ఫీవర్) ప్రొడక్షన్స్ ఈ వెబ్ సిరీ్స ని నిర్మించారు. ఆహా ఓటీటీలో ‘కమిట్ మెంటల్’ నవంబర్ 13 నుంచి ప్రసారం కానుంది.