Templates by BIGtheme NET
Home >> Cinema News >> హిందూ-ముస్లిమ్ గొడవలపై `బొంబాయి` సీక్వెలా?

హిందూ-ముస్లిమ్ గొడవలపై `బొంబాయి` సీక్వెలా?


90లలో బొంబాయిలో హిందూ-ముస్లిమ్ మతోన్మాద అల్లర్ల గురించి తెలిసిందే. ఇవే రియల్ అల్లర్ల నేపథ్యంలో ఒక హృద్యమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించి సంచలనానికి తెర తీసారు దర్శకమణి మణిరత్నం. అరవింద స్వామి-మనీషా కొయిలారా జంటగా మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి మత వివాదాల నడుమ లవ్ స్టోరీతో ఎంతటి సంచలనం సృష్టించిందో ఇప్పటికీ మరువలేరు.

అయితే సేమ్ అలాంటి కథే కాదు కానీ.. తాజాగా శింబు లాంచ్ చేసిన పోస్టర్ చూస్తుంటే అవే గొడవల్ని తిప్పి చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఓవైపు కథానాయకుడు నమాజ్ చేస్తుంటే చుట్టూ మతోన్మాదుల అల్లర్లు గొడవలు కనిపిస్తున్నాయి. నడి రోడ్డుపై నమాజ్ చేస్తున్న ముస్లిమ్ యువకుడైన శింబు పోస్టర్ ఎన్నో అర్థాల్ని అంతరార్థాల్ని సైలెంటుగా రివీల్ చేస్తోంది.

ఇది మానాడు పోస్టర్. తొలి గ్లింప్స్. ఒంటరి యుద్ధానికి పోరాటానికి సిద్ధమవుతున్న యువకుడి కథ అంటూ ట్విస్టిచ్చారు. ఆవేశపూరిత అల్లర్ల మధ్య ప్రార్థనలు చేస్తున్న ముస్లిమ్ యువకుడిగా శింబు ఎమోషన్ ని రగిలించబోతున్నాడని ఈ పోస్టర్ చెబుతోంది. “ఒంటరిగా నిలబడటం అంటే సరైనదాని కోసం నిలబడండి” అనే ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చారు. ఈ సినిమా నుండి తన క్యారెక్టర్ లుక్ ను వెల్లడించే కొత్త పోస్టర్ విడుదల కానుందని సింబు ఇదివరకూ ప్రకటించారు. వెంకట్ ప్రభు రచన దర్శకత్వం వహించిన మానాడులో సింబు అబ్దుల్ ఖాలిక్ అనే యువకుడి పాత్రలో నటించారు. పోస్టర్ తీరు చూస్తుంటే ఈ చిత్రం మత రాజకీయాల్లో పాల్గొనే రాజకీయ పార్టీల ప్రమేయంపై సినిమా ఇదని అర్థమవుతోంది.

ఇటీవల పుదుచ్చేరిలో మానాడు షూటింగ్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లక ముందే వరుస సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రాజెక్ట్ పురోగతిని దెబ్బతీసిన ప్రధాన సమస్యలలో ఒకటి నిర్మాత సురేష్ కామాచీతో శింబు వివాదం.. సింబుకు వృత్తిగత నిబద్ధత లేదని ఆరోపిస్తూ వేరే నటుడితో ప్రధాన పాత్రలో సినిమా చేస్తానని సురేష్ బహిరంగ ప్రకటన చేయడం హీట్ పెంచింది.

అయితే ఆ తరువాత దర్శకుడితో శింబు వివాదాల్ని పరిష్కరించుకున్నాడు. తదనంతరం అతను సినిమాలో రీకాస్ట్ అయ్యాడు. COVID-19 భద్రతా ప్రోటోకాల్లను అనుసరించి షూటింగ్ జరుగుతోంది. అలాగే చిత్రనిర్మాతలు ఆయుర్వేద వైద్యుడి సేవలను ఆన్ లొకేషన్ వినియోగిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే తారాగణం సిబ్బంది రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారట. ఇందులో శింబు.. ఎస్.జె.సూర్య.. ఎస్.ఐ.చంద్రశేఖర్.. మనోజ్ భారతీరాజా.. డేనియల్ పోప్.. వై గీ మహేంద్రన్.. కరుణకరన్ .. ప్రేమ్గీ అమరన్ తదితరులు నటిస్తున్నారు.