బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్

0

టాలీవుడ్ లో హీరోగా సహాయ నటుడిగా రాణిస్తున్న నందు విజయ కృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ”బొమ్మ బ్లాక్ బస్టర్”. బుల్లితెరపై యాంకర్ గా సత్తా చాటుతున్న రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించింది. రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల – బోసుబాబు నిడుమోలు – ఆనంద్ రెడ్డి – మనోహర్ రెడ్డి కలిసి నిర్మించారు. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నందు ‘పోతురాజు’ అనే క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. అంతేకాకుండా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి వీరాభిమానిగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి సందర్భంగా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ టీజర్ ని హీరో శ్రీవిష్ణు విడుదల చేసాడు.

ఈ టీజర్ లో శ్రీవిష్ణు వాయిస్ ఓవర్ ద్వారా పోతురాజు క్యారక్టరైజేషన్ పరిచయం చేశాడు. ”ఈ మొనగాడు పేరు పోతురాజు. ఇతగాడికి పూరీ జగన్నాథ్ అంటే ఇష్టమనడంలో సందేహమే లేదు. పోకిరి సినిమా చూసిన తర్వాత అది పిచ్చిగా మారిందనడంలో అస్సలు సందేహమే లేదు” హీరో పాత్ర ఏంటో చెప్పారు. పోతురాజు తన రియల్ లైఫ్ స్టోరీని సినిమాగా రాసి.. ఫేవరైట్ డైరెక్టర్ అయిన పూరీకి ఇవ్వాలని.. బ్రతికినా చచ్చినా జీవితాంతం పూరీ డైరెక్షన్ లో బ్రతికుండాలని అనుకుంటాడని టీజర్ ద్వారా వెల్లడించారు. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..’ అనే డైలాగ్ ని నాటకాల్లో పద్యం చెప్పినట్లు నందు చెప్పడంతో హీరో స్టేజి నాటకాలు వేసే వాడని తెలుస్తోంది. ఇక హీరోయిన్ రష్మీ గొడవలు అంటే చాలా ఇష్టపడే పోతురాజు లవర్ వాణిగా కనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే నటన పరంగా నందు కెరీర్లో బెస్ట్ సినిమాగా నిలవనుందని అర్థం అవుతోంది. ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ఇప్పటికే షూటింగ్ తోపాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.