కేథరిన్ బోర్ డమ్ అలా బయటపడిందిగా

0

మద్రాస్ .. కళైరసి లాంటి మలయాళ చిత్రాల్లో నటించింది కేథరిన్ థ్రెసా. కెరీర్ డెబ్యూ సినిమాలివి. ఇప్పటికే మద్రాస్ రిలీజై ఆరేళ్లయ్యింది. ఈ సందర్భంగా ఆ సినిమా చిత్రీకరణ సమయంలోని కొన్ని స్టిల్స్ ని షేర్ చేసిన కేథరిన్ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. అంతకుమించిన బెస్ట్ డెబ్యూ ఆఫర్లు వేరొకరికి ఉండవేమో! అంటూ ఫోటోల్ని సేర్ చేసింది.

ఇకపోతే మలయాళం నుంచి ఇటు తమిళం తెలుగు పరిశ్రమల్లోనూ అడుగు పెట్టిన కేథరిన్ ఇక్కడ చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటించినా స్టార్ హీరోయిన్ రేంజుకు మాత్రం ఎదగలేకపోయింది. టూ టైర్ రేంజ్ హీరోయిన్ గానే కెరీర్ ని రన్ చేయాల్సి వచ్చింది అమ్మడు. ఇక ఇటీవల తెలుగులో అసలే సినిమాల్లేకుండా అయిపోయింది. అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్ అవకాశం ఇచ్చినా అది డిజాస్టర్ అయిన ప్రభావం తనని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.

ఇటీవల ఈ అమ్మడు ఇన్ స్టా మాధ్యమంలో ఇతర నాయికలతో పోటీపడుతూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. తాజాగా కేథరిన్ థ్రెసా షేర్ చేసిన ఫోటో అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. `వెన్ బోర్ డమ్ సెట్స్ ఇన్.. ది షేడ్స్ కమ్ అవుట్` అన్న క్యాప్షన్ ని ఈ ఫోటోకి ఇచ్చింది. ఎంతగా బోర్ ఫీలయ్యిందో కానీ కేథరిన్ లో షేడ్స్ అన్నీ బయటపడిపోయాయ్. అలా బోర్ కొట్టకుండా ఉండాలంటే వరుసగా అవకాశాలు అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత వేరొక సినిమాకి సంతకం చేసినట్టు లేదు. మరి ఏవైనా కథలు విందేమో తనే చెప్పాల్సి ఉంటుంది.