మెగాస్టార్ ను ఆశీర్వదిస్తున్న అల్లువారు

0

నేడు లెజెండ్రీ కమెడియన్ కమ్ ఫిల్మ్ మేకర్ అల్లు రామలింగయ్య 99వ జయంతి. ఈ సందర్బంగా ఆయనతో అనుబంధం ఉన్న అందరు కూడా సోషల్ మీడియా ద్వారా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. అల్లు కుటుంబ సభ్యులు నేడు ఆయన జయంతి సందర్బంగా అల్లు స్టూడియోస్ ను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. అల్లు అర్జున్ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఆయన్ను గుర్తు చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అల్లు వారి అల్లుడు అయిన మెగాస్టార్ చిరంజీవి కూడా మామ అల్లు రామలింగయ్యను గుర్తు చేసుకున్నారు.

చిరంజీవి తన పెళ్లి రోజు ఫొటోను షేర్ చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులను అల్లు రామలింగయ్య ఆశీర్వదిస్తున్నారు. ఈ ఫొటోను మొదటి సారి చిరంజీవి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంచ కట్టులో ఉన్న అల్లు రామలింగయ్య తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫొటోలో చిరంజీవి దంపతులతో పాటు చిరు సోదరిని కూడా చూడవచ్చు.