పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా మెగా ‘లూసీఫర్’

0

మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన కామెడీ.. సాంగ్స్.. రొమాన్స్ ఇలా ఏమీ ఉండవు. కాని అక్కడ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కాని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు పక్కకు పెడతారు. సినిమాలో తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకుంటారు. తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చాలంటే ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. అలా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా వచ్చిన సినిమాల పరిస్థితి ఏమైంది అనేది మనకు తెలిసిందే. అందుకే లూసీఫర్ సినిమా ను పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మార్చి చిరంజీవితో తీయాలని వినాయక్ భావిస్తున్నాడట.

చిరంజీవి లూసీఫర్ సినిమా రీమేక్ బాధ్యతలను సుజీత్ కు అప్పగించగా ఆయన కమర్షియల్ గా స్క్రిప్ట్ ను మార్చడంలో విఫలం అయ్యాడు. అందుకే వినాయక్ కు ఆ బాధ్యతలు అప్పగించగా తన రచయితల టీం మరియు కొందరు దర్శకులతో చర్చలు జరిపి స్క్రిప్ట్ ను రెడీ చేశారట. లూసీఫర్ స్టోరీ మెయిన్ స్ట్రీమ్ మిస్ అవ్వకుండా పాటలు.. ఫైట్లు.. కామెడీ.. రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మెగా అభిమానులు చిరంజీవి సినిమాలో డాన్స్ లు పాటలు లేకుంటే అస్సలు ఒప్పుకోరు. కనుక వారి కోరిక మేరకు కామెడీతో పాటు అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను లూసీఫర్ తెలుగు రీమేక్ లో జొప్పించబోతున్నారు.

వినాయక్.. చిరు కాంబోకు మంచి సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉంది. కనుక ఖచ్చితంగా ఈ రీమేక్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేయబోతున్నాడు. ఆ తర్వాత వివి వినాయక్ సినిమాను చేయబోతున్నాడు.