మెగాస్టార్ బర్త్ డే కానుకగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ రెడీ…!

0

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. అయితే అందరూ తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్న నేపథ్యంలో చిరు సినిమా నుంచి కూడా అప్డేట్ వస్తుందని మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారు ఎన్నాళ్ళుగానో వేచిన తరుణం వచ్చేసింది.

కాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్ 22న జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి ‘ఆచార్య’కు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చిరు బర్త్ డే నాడు సాయంత్రం 4 గంటలకు చిరు కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అదే రోజు ఈ మూవీ టైటిల్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో మెగా అభిమానులు చిరు బర్త్ డే గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ ఆగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.