Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆ నిర్మాణ సంస్థ నిర్ణయాన్ని తప్పుబట్టిన స్టార్ డైరెక్టర్

ఆ నిర్మాణ సంస్థ నిర్ణయాన్ని తప్పుబట్టిన స్టార్ డైరెక్టర్


కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది వందల సినిమాలు ఆగిపోయాయి. హాలీవుడ్ లో వందల కోట్ల తో నిర్మాణం జరిగిన సినిమాలను సైతం విడుదల వాయిదా వేశారు. వచ్చే ఏడాది మొత్తం కూడా పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే తాము నిర్మిస్తున్న సినిమాలు అన్ని కూడా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల చేయడంతో పాటు అదే సమయంలో ఓటీటీలో కూడా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రకటించింది. వీరి నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులు భిన్న స్వరం వినిపిస్తున్నారు.

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఈ విషయమై స్పందించాడు. వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. వారి నిర్ణయం ఏమాత్రం సరైనది కాదు. సంస్థలో ఎంతో మంది నటీనటులు టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. వారితో కనీసం సంప్రదించకుండా వారు తీసుకున్న నిర్ణయంను క్రిస్టోఫర్ వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించాడు. తమ సినిమాలను పెద్ద స్క్రీన్ ల్లో చూడాలనుకుంటున్న వారు ఇప్పుడు ఓటీటీలో విడుదల అవ్వడం వల్ల వారు ఆవేదన వ్యక్తం చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక వార్నర్ బ్రదర్స్ ఒప్పందం చేసుకున్న హెచ్బీవో మాక్స్ ఓటీటీపై కూడా క్రిస్టోఫర్ విమర్శలు చేశాడు. అదో చెత్త ఓటీటీ ప్లాట్ ఫామ్ వారితో వార్నర్ బ్రదర్స్ ఒప్పందం చేసుకోవడం ఏంటో అంటూ ఎద్దేవ చేశాడు. క్రిస్టోఫర్ వ్యాఖ్యలపై చాలా మంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు.