కూలీ నంబర్ 1 ట్రైలర్ టాక్

0

వరుణ్ ధావన్- సారా అలీ ఖాన్ జంటగా నటించిన కూలీ నెం 1 ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం గోవింద -కరిష్మా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 1995 క్లాసిక్ కి రీమేక్.

ఈ చిత్రాన్ని వాసు భగ్నానీ నిర్మించారు. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. కూలీ నెం 1 చిత్రం కోసం వీరిద్దరూ తొలిసారిగా 25 సంవత్సరాల క్రితం కలిసారు. తాజాగా కూలీ నెం 1 ట్రైలర్ ను వరుణ్ ధావన్ ట్విట్టర్ లో పంచుకున్నారు

ఆసియాలో అతిపెద్ద ఓడరేవుతో పాటు బుర్జ్ ఖలీఫాను సొంతం చేసుకున్న ధనవంతుడిగా వరుణ్ ధావన్ పాత్రను పరిచయం చేయడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. కానీ అసలు సంగతి వేరే. దేశంలో అత్యంత ధనవంతుడైన పరేష్ రావల్ ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న కూలీ అని ఆ తర్వత రివీలవుతుంది. ట్రైలర్ ఆద్యంతం ఫన్ రొమాన్స్ హిలేరియస్ గా వర్కవుటైంది. అందాల కథానాయిక సారా అలీ ఖాన్ తో ధావన్ బోయ్ రొమాన్స్ పీక్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా అండర్ వాటర్ లిప్ లాక్ లో యువజంట జీవించేసిందంటే అతిశయోక్తి కాదు.

కూలీ నెం 1 ట్రైలర్ ఆద్యంతం వరుణ్ ధావన్ పెర్ఫామెన్స్ రక్తి కట్టిస్తోంది. ధనికుడిగా కూలీనంబర్ వన్ గా అతడి ఆహార్యంలో వేరియేషన్ మైమరిపిస్తుంది. క్లాసిక్ మూవీలో గోవింద పాపులర్ డైలాగ్ “దునియా మేరా ఘర్ హై.. స్టేషన్ మేరా అడ్డా హై.. జబ్ మన్ కరే ఆ జన.. రాజు మేరా నామ్ హై … ఊర్ ప్యార్ సే లగ్ ముఝే బులెట్ హై కూలీ నెం 1“ ని ధావన్ రిపీట్ చేశారు.

ధనవంతుడైన వ్యాపారవేత్త.. మ్యాచ్ మేకర్ అయిన జై కిషన్ తన కుమార్తెను కోటీశ్వరుడని భావించి రాజు అనే కూలీకిచ్చిపెళ్లి చేయడం అటుపై రియలైజేషన్ నేపథ్యంలోని కథాంశమిది. అయితే తమ కుటుంబాన్ని అవమానించిన అతడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు కూతురిని ప్రేమించి వివాహం చేసుకోవడం ద్వారా పాఠం నేర్పించే కుర్రాడిగా ధావన్ కనిపిస్తాడు.

అయినప్పటికీ వారు ఏదో చేపలుగలవారని మరియు రాజు యొక్క మోసాలు కనుగొనబడతాయని ఇది పేర్కొంది. అపజయాన్ని కప్పిపుచ్చడానికి రాజు ధనిక జంటను వండుతాడు మరియు కామెడీ ఆఫ్ ఎర్రర్ జరుగుతుంది.

కూలీ నంబర్ 1 రీమేక్ డేవిడ్ ధావన్ 45 వ చిత్రం. ఇందులో జావేద్ జాఫరీ- రాజ్పాల్ యాదవ్- సాహిల్ వైద్- జానీ లివర్ తదితరులు నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 25 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది. ఇందులో వరుణ్ – సారా అలీఖాన్ తొలిసారిగా జంటగా నటిస్తున్నారు.