జెనీలియా కి కరోనా పాజిటివ్

0

తెలుగు ప్రేక్షకులను అలరించి హిందీలోనూ నటించి మెప్పించి బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో చాలా సంతోషకమైన జీవితాన్ని సాగిస్తున్న బొమ్మరిలు హాసిని జెనీలియా కరోన బారిన పడ్డట్లుగా పేర్కొంది. అయితే మూడు వారాల క్రితం తనకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని పేర్కొన్న జెనీలియా దేవుడి దయవల్ల తాజా టెస్టులో కరోనా నెగటివ్ వచ్చిందని పేర్కొంది. జెనీలియాకు కరోనా వచ్చిన విషయం బయట ఎవరికి తెలియలేదు. ఆమెకు నెగటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందరికి తెల్సింది.

సోషల్ మీడియాలో తన కరోన నెగటివ్ ను జెనీలియా ప్రకటించింది. గత 21 రోజులుగా నేను కరోనాతో బాధపడ్డాను. దేవుడి దయవల్ల ఇప్పుడు కరోనా నెగటివ్ వచ్చింది. ఈ 21 రోజులు నేను ఐసోలేషన్ లో ఉన్నాను. ఆ సమయం నాకు చాలా భారంగా గడిచింది. ప్రతి రోజు నాకు ఒక ఛాలెంజింగ్ గా అనిపించింది. మళ్లీ నా ఫ్యామిలీతో కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోండి.. ఆరోగ్యవంతమైన మరియు ఇమ్యూనిటీ ఇచ్చే ఆహారంను తీసుకోండి.. ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నించండి ఇవి మాత్రమే కరోనాను జయించేందుకు ఔషదాలు అంటూ తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా జెనీలియా వెళ్లడించింది.