దగ్గుబాటి వారి స్టైల్ వేరబ్బా..!

0

కరోనా టైం లో పెళ్లి చేసుకున్న రానా చాలా తక్కువ మంది బంధు మిత్రులను మాత్రమే ఆహ్వానించాడు. పెళ్లికి హాజరు కాని వారు వర్చువల్ రియాల్టీలో చూడాల్సిందిగా రానా అందుకు సంబంధించిన కిట్ ను పంపించారు. నాని అందులో పెళ్లి చూస్తున్నట్లుగా ఫొటో షేర్ చేశాడు. ఇంకా పలువురు బంధు మిత్రులు కూడా ఇంటి వద్దే ఉండి రానా పెళ్లిని చూసేశారు. ఇక పెళ్లికి హాజరు కాని సినీ ప్రముఖులకు సురేష్ బాబ దంపతులు ఒక కిట్ ను పంపించారు. అందులో ఒక లేఖ తో పాటు బహుమానాలు ఉన్నాయట.

తమ పెద్ద కుమారుడి వివాహానికి మిమ్ములను ఆహ్వానించలేక పోయాం. మీ ఆశీర్వాదాలు వారికి కావాలంటూ లేఖ తో పాటు బహుమానంను ఇచ్చారట. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. దగ్గబాట వారి పెళ్లి అంటే సాదా సీదాగా ఉండదు. కాని కరోనా కారణంగా సింపుల్ గా చేయాల్సి వచ్చింది. అందుకే పెళ్లి తర్వాత అయిన పెళ్లి గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా బహుమానాలు మరియు లేఖలను పంపించారనే టాక్ వినిపిస్తుంది.

రానా మిహీకా బజాజ్ లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరి ప్రేమ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆనందంతో ఒప్పుకుని వైభవంగా వివాహం చేశారు. మొదట కరోనా పోయిన తర్వాత పెళ్లి అనుకున్నారు. కాని ఎప్పటి వరకు కరోనా నుండి బయట పడతాం అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థతుల్లో లాక్ డౌన్ నియమ నిబంధనలతో పెళ్లి కానిచ్చేశారు. టాలీవుడ్ స్టార్స్ ఎంతో మంది రానా వివాహంను మిస్ అయ్యామని అనుకున్నారు.